మంగళ సూత్రాన్ని నాలుగు గ్రాములు పెట్టి చేయించుకుంటారు.. చాలామంది. అయితే ఈ ఇక్కడ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి తన భార్య కోసం కేజీ బంగారంతో మంగళసూత్రాన్ని చేయించి కానుకగా ఇచ్చాడు. ఆ మంగళ సూత్రం కాస్తా సోషల్ మీడియాలో వైరలై పోలీసుల దృష్టిని ఆకర్షించింది. చివరికి జరిపిన విచారణలో పోలీసులకు షాకిచ్చే నిజ తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. బివాండీలో నివసించే బాలా అనే వ్యక్తి తన భార్యకు కేజీ బంగారంతో తయారు చేసిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు. సాధారణంగా మహిళల మెడలో మంగళసూత్రం గుండెల దాకా ఉంటుంది. లేదా ఇంకాస్త పొడుగు ఉంటుంది. కానీ ఈ కేజీ మంగళసూత్రం ఏకంగా ఆమె మోకాళ్ల వరకు పొడగు ఉంది. ఆ బంగారం లాంటి భారీ మంగళసూత్రాన్ని ధరించి ఆమెగారు..తనకు అంత భారీ బహుమతి ఇచ్చిన భర్తగారితో కలిసి రకరకాల యాంగిల్స్‌లో ఫోజులు ఇస్తూ.. వీడియో దిగింది.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయి.. పోలీసుల దృష్టికి వెళ్ళింది. విచారణలో ఒక కేజీ బంగారు మంగళసూత్రం నిజమైనది కాదని.. నకిలీ బంగారం (గిల్టు) అని చెప్పాడు. బంగారు షాపునుంచి 38వేల రూపాయలకు కొన్నానని చెప్పటంతో పోలీసులు షాక్ అయ్యారు. దీంతో పోలీసులు అది నిజమా? కాదా? అని ఎంక్వయిరీ చేయగా బాలా చెప్పింది నిజమేనని తేలటం ఇక చేసేదేమీ లేక పోలీసులు అతడ్ని ఇంటికి పంపించేశారు.
దీనిపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. '' కేజీ బంగారు తాళి వీడియో వైరల్ మా దృష్టికి రావటంతో చోరీలు జరుగుతున్న క్రమంలో అది వారికి ప్రమాదమని.. దాంతో అతడిని ఎంక్వయిరీకి పిలిపించామని తెలిపారు.
అలాగే ఇలా బంగారు నగలు అని పబ్లిసిటీ చేసుకుంటే అది ప్రమాదాలకు దారి తీస్తుందనీ.. ఇటువంటి పబ్లిసిటీలు దొంగల్ని ఆహ్వానించటమే. ప్రాణాల మీదకు తెచ్చుకోవటమనేనని తెలిపారు. అందుకే బాలా కోలిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించామని తెలిపారు.