లెమ్యూర్ అనే జంతువు చేసే డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంతువు డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను యూకే చెందిన చెస్టర్ జూ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. "కలుసుకోండి.. మీ కొత్త అభిమాన జంతువు.. ది సిఫాకను" అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. డ్యాన్స్ చేస్తున్న రెండు లెమ్యూర్‌లలో ఒకటి ఆడది కాగా..మరొకటి. మగది.
ఆడ లెమ్యూర్ పేరు బీట్రైస్, మగ లెమ్యూర్ పేరు ఇలియట్. వీటిని నార్త్ కరోలినాలోని డ్యూక్ లెమ్యూర్ సెంటర్ నుంచి యూకేకు తరలించారు. లెమ్యూర్ విషయానికి వస్తే..దక్షిణ మడగాస్కర్ లోని దట్టమైన అడవుల్లో నివాసం ఉంటాయి. కోతుల మాదిరిగా ఉంటాయి.
కోతులకు ఉన్నట్లుగానే..పొడవైన తోక ఉంటుంది. బూడిత, తెలుపు రంగులతో కూడిన శరీరం ఉంటుంది. కండ్లు ఎర్రగా, నల్లగా చూడటానికి వింతగా ఉంటుంది. ఇవి చేసే చిలిపి చేష్టలు అందర్నీ అలరిస్తాయి.