Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భద్రత ఇస్తే ఏకంగా ఇంట్లో చొరబడ్డ నటి... నన్ను కుక్కలా చూస్తున్నారంటోంది...

Advertiesment
భద్రత ఇస్తే ఏకంగా ఇంట్లో చొరబడ్డ నటి... నన్ను కుక్కలా చూస్తున్నారంటోంది...
, సోమవారం, 10 డిశెంబరు 2018 (17:18 IST)
ఆస్తుల కోసం తల్లీ లేదు తండ్రీ లేడు పిల్లా లేదు జల్లా లేదు... అదేనండీ, ఆస్తుల కోసం కన్నవారినే రోడ్డుకీడ్చేవారు కొందరు, ఆస్తుల గొడవలో కుటుంబమే విచ్ఛినమై రోడ్డునపడేవారు మరికొందరు. ఇలా ఆస్తులనేవి మనిషిని రకరకాలుగా మార్చేస్తుంటుంది. దీనికి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే చాలానే వుంటాయనుకోండి. 
 
ఇక అసలు విషయానికి వస్తే... తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తె గత కొన్ని రోజులుగా చెన్నైలోని మదురవాయల్ సమీపంలోని ఆలపాక్కం అష్టలక్ష్మినగర్లో వున్న తండ్రి ఇంటిని అద్దెకు తీసుకుని ఖాళీ చేయకుండా తిష్ట వేసింది. దీనితో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను బయటు పంపించారు. ఆ తర్వాత ఆమె ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని వున్నదని కేసులో పేర్కొనడంతో ఆమెకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. 
 
ఐతే సందట్లో సడేమియా అన్నట్లు... ఇంటిలో వుండే అధికారం తనకు వున్నదంటూ మరోసారి వనిత ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీనితో మళ్లీ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. వెంటనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విడుదల చేశారు. కాగా ఆ ఇల్లు తన తల్లి మంజులది అనీ, ఆ ఇంట్లో తను వుంటే తప్పేంటి అని ప్రశ్నిస్తోంది వనిత. పోలీసులు తనను ఓ కుక్కలా చూస్తున్నారనీ, తనపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తోంది ఆమె.  ఏం చేస్తాం... ఆస్తులుంటే ఒక గొడవు లేకపోతే ఇంకో గొడవ. ఈ ఆస్తులతో గొడవలు జరిగినప్పుడు చాలామంది ఇలా అంటుంటారు... ఎందుకు సంపాదించామురా దేవుడా అని. అంతకంటే ఏం చేస్తారు మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ నుంచి డార్క్ మోడ్ ఫీచర్.. కంటిని కాపాడుకోవచ్చు...