టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలకు షాక్ తగిలింది. పింక్ డైమండ్ వ్యవహారంలో చెరో వంద కోట్ల రూపాయలకు టీటీడీ ఇప్పటికే పరువు నష్టం కేసు వేసింది.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును విత్ డ్రా చేసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో కోర్టులో ఉపసంహరణ పిటిషన్ కూడా టీటీడీ దాఖలు చేసిన నేపథ్యంలో కేసును విత్ డ్రా చేసుకోడానికి వీల్లేదని, కేసులో పార్టీలుగా చేర్చాలని తెలంగాణ హిందూ జనశక్తితోపాటు, మరో న్యాయవాది పిటిషన్ వేశారు.
టీటీడీతోపాటు పార్టీలుగా ఉండడానికి తిరుపతి పదవ అదనపు జడ్జి తీర్పు ఇవ్వబోతోంది. రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలపై ఇంకా విచారణ కొనసాగుతోంది.