Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఘనంగా ప్రారంభమైన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(ఫోటోలు)

Mukesh Ambani
, శుక్రవారం, 31 మార్చి 2023 (22:57 IST)
ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. హాలీవుడ్, బాలీవుడ్, క్రీడా ప్రపంచం, రాజకీయాలు, పారిశ్రామికవేత్తలు... ఎందరో ప్రముఖులు గ్రాండ్ ఈవెంట్‌లో భాగమయ్యారు.
webdunia
రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ, ఆమె కుమార్తె ఇషా అంబానీ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు.

 
webdunia
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ, “సాంస్కృతిక కేంద్రానికి లభిస్తున్న ఆదరణ చూసి నేను ముగ్ధురాలునయ్యాను. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ సాంస్కృతిక కేంద్రాలలో ఒకటి. అన్ని కళలు- కళాకారులకు ఇక్కడికి స్వాగతం. ఇక్కడ చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాల యువత కూడా తమ కళలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదర్శనలు ఇక్కడికి వస్తాయని ఆశిస్తున్నాను." అని అన్నారు.

 
webdunia
ఆర్‌ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, “ఇది ముంబైకి, దేశం మొత్తానికి ప్రధాన కళా కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. ఇక్కడ భారీ ప్రదర్శనలు నిర్వహించవచ్చు. భారతీయులు తమ పూర్తి కళాత్మకతతో అసలైన ప్రదర్శనలను రూపొందించగలరని నేను ఆశిస్తున్నాను." అని అన్నారు.

 
webdunia
భారతరత్న సచిన్ టెండూల్కర్ తన చిరునవ్వుతో హాజరయ్యారు. ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా, స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, అథ్లెట్ దీపా మాలిక్ కూడా సెంటర్‌కు చేరుకుని కళాకారులను ఉత్సాహపరిచారు.

 
webdunia
సూపర్ స్టార్ రజనీకాంత్, అమీర్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక్ చోప్రా, వరుణ్ ధావన్, సోనమ్ కపూర్, అనుపమ్ ఖేర్, జావేద్ అక్తర్, షబానా అజ్మీ, సునీల్ శెట్టి, షాహిద్ కపూర్, విద్యాబాలన్, అలియా భట్, దియా మీర్జా, శ్రద్ధా కపూర్, రాజు హిరానీ, తుషార్ కపూర్ వంటి బాలీవుడ్ తారలు సాయంత్రమంతా అలరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ ప్రేరణతోనే బీజేపీ నేతపై దాడి.. ఆర్ఆర్ఆర్ ఆరోపణ