Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శోభన మహోత్సవ ఆహ్వానం, రతి యుద్ధంలో బ్రహ్మచారి జీవితాన్ని కోల్పోతున్నా, ఎవరు?

Advertiesment
శోభన మహోత్సవ ఆహ్వానం, రతి యుద్ధంలో బ్రహ్మచారి జీవితాన్ని కోల్పోతున్నా, ఎవరు?
, శుక్రవారం, 18 అక్టోబరు 2019 (18:39 IST)
తూర్పు గోదావరిజిల్లా జగ్గంపేట. అతని పేరు మరెళ్ళ రాజేష్. రాధతో ఇతనికి వివాహం జరిగింది. సాధారణంగా వివాహం అయిన తరువాత శోభనం నిర్వహించడం ఆనవాయితీ. శోభనాన్ని కూడా సంప్రదాయబద్థంగానే చేస్తారు. అలాగని ఊరంతా శోభనం గురించి ఎవ్వరూ చెప్పుకోరు. అలా చెప్పుకుని చేసుకోరు. కానీ రాజేష్ రూటే సెపరేటు. ఏకంగా శోభన మహోత్సవ ఆహ్వానమంటూ ఊరంతా ఫ్లెక్సీలు పెట్టాడు. ఆ ఫ్లెక్సీలో ఏం రాశాడో మీరే చదవండి.
 
మరెళ్ళ రాజేష్ అనే నేను.. నేటితో నా బ్రహ్మచారి జీవితానికి సంప్రదాయబద్థంగా స్వస్తి పలికి.. ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న తొలిరేయి అనుభవానికి తహ తహలాడుతూ.. యుద్ధానికి సిద్ధమైన సైనికుడి వలె.. ఈరోజు జరిగే రతి యుద్ధాన్ని ముహూర్త సమయానికి ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే నా తల్లిదండ్రులను నానమ్మ, తాతయ్యలను చేస్తానని అంతఃకరణశుద్థితో ప్రమాణం చేస్తున్నా...
 
ఇదీ రాజేష్ ఫ్లెక్సీల్లో చేసుకున్న ప్రచారం. ఇప్పటివరకు బహుశా శోభన మహోత్స ఆహ్వానమంటూ ఫ్లెక్సీలు ఎవరూ వేయించిన దాఖలాలు లేవు. మొదటిసారి రాజేష్ ఇలాంటి ఫ్లెక్సీలు వేయించడం కుటుంబ సభ్యులనే కాదు ఆ ఊరివారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కానీ దీనిపై ఎవ్వరూ ఏమీ నోరు మెదపడంలేదు. అతడు మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా ఇలా ఫ్లెక్సీలు బజార్లో పెట్టేశాడు. మున్ముందు ఎలాంటి ప్రకటనలు చేస్తాడో మరి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్కి ఆశ్రమాల్లో ఐటీ సోదాలు, ఎంత డబ్బు పట్టుకున్నారో తెలిస్తే షాకే..