Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సర్దార్ గబ్బర్ సింగ్' బుల్లెట్ గురితప్పింది : బొండా.. డొక్కా.. చినరాజప్ప

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ నేతల మాటల యుద్ధం ప్రారంభమైంది. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను టీడీపీ నేతలు ఏమాత్రం జీర్

'సర్దార్ గబ్బర్ సింగ్' బుల్లెట్ గురితప్పింది : బొండా.. డొక్కా.. చినరాజప్ప
, గురువారం, 15 మార్చి 2018 (11:03 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ నేతల మాటల యుద్ధం ప్రారంభమైంది. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను టీడీపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ఆయనపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. 
 
చంద్రబాబు నాయుడు, లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యలను పవన్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 'సర్దార్ గబ్బర్‌ సింగ్‌' గురి తప్పాడంటూ.. తక్షణమే చంద్రబాబు, లోకేశ్‌కు పవన్‌ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ గురువారమిక్కడ డిమాండ్‌ చేశారు. అర్థంపర్థం లేని విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు.
 
అలాగే, హోంమంత్రి చిన్నరాజప్ప మాట్లాడుతూ, పవన్‌ టీడీపీనే టార్గెట్‌ చేశారన్న విషయం ఆయన మాటల్లోనే తేటతెల్లమైందన్నారు. కేంద్రం కుట్రలో భాగంగానే పవన్‌ మాట్లాడరని, ఆయన బీజేపీతో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. బీజేపీ సహకారం లేకున్నా సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. పవన్‌ తన కార్యకర్తలకు సూచనలు ఇవ్వకుండా టీడీపీని టార్గెట్‌ చేశారన్నారు. కేంద్రం కుట్రలో భాగంగానే పవన్‌ వ్యాఖ్యలు ఉన్నాయని, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. 
 
డబ్బులు తీసుకోండి... జనసేనకు ఓటెయ్యండని పవన్‌ చెప్పడం విచారకరమన్నారు. నీతుల చెప్పే పవన్‌ డబ్బులు తీసుకోమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నారా లోకేశ్‌ రాబోయే రోజుల్లో పెద్ద నాయకుడు అవుతాడని పవన్‌ టార్గెట్‌ చేశాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యేలు ఉన్నారనడం బాధాకరమని చినరాజప్ప అన్నారు. 
 
ఆ తర్వాత ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, చంద్రబాబుపై పవన్‌ అర్థంలేని ఆరోపణలు చేశారు. ఏ ఉద్దేశంతో సీఎం, లోకేశ్‌పై విమర్శలు చేశారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి. బీజేపీపై ఎందుకు విమర్శలు చేయలేదు. ఆ పార్టీ ఆడినట్లు ఎందుకు ఆడుతున్నారు. లోకేశ్‌ అవినీతి గురించి ఒక్క ఆధారాన్ని చూపించండి. శేఖర్‌ రెడ్డికి లోకేశ్‌కు ఏమి సంబంధం. లోకేశ్‌కు శేఖర్‌రెడ్డికి సంబంధం ఉందని ప్రధానమంత్రి మోడీ మీకు చెప్పారా?. బీజేపీ ఓ వైపు జనసేన, మరోవైపు వైఎస్‌ఆర్‌ సీపీని పెట్టుకుని రాజకీయాలు చేస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ పేరు పవన్‌ తన ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదు. పవన్‌ పార్ట్‌టైం పొలిటీషియన్‌ అంటూ ధ్వజమెత్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు మహాకుట్ర : పార్టీ నేతలతో చంద్రబాబు