Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్త్రీ, పురుషుల అవసరార్థం పెట్టుకునేదే వివాహేతర సంబంధం.. తప్పులేదట!?

స్త్రీపురుషులు అవసరార్థం పెట్టుకునేదే వివాహేతర సంబంధం అని, అలాంటిదాన్ని తప్పుగా పరిగణించలేమని, అందువల్ల ఐపీసీ 497 సెక్షన్‌కు సవరణలు చేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సూత్రప్రాయంగా సమ్మతం తెలిపింది.

Advertiesment
స్త్రీ, పురుషుల అవసరార్థం పెట్టుకునేదే వివాహేతర సంబంధం.. తప్పులేదట!?
, శుక్రవారం, 3 ఆగస్టు 2018 (12:33 IST)
స్త్రీపురుషులు అవసరార్థం పెట్టుకునేదే వివాహేతర సంబంధం అని, అలాంటిదాన్ని తప్పుగా పరిగణించలేమని, అందువల్ల ఐపీసీ 497 సెక్షన్‌కు సవరణలు చేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సూత్రప్రాయంగా సమ్మతం తెలిపింది.
 
భారత శిక్ష్మాస్మృతిలోని 497 సెక్షన్ గత బ్రిటీషన్ పాలకుల సమయం నుంచి దేశంలో అమలవుతోంది. ఈ సెక్షన్ ప్రకారం... ఓ వివాహిత పురుషుడు వివాహిత స్త్రీతో సంబంధం పెట్టుకుని పట్టుబడితే, ఇంతకాలం పురుషుడికి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధించేవారు. ఆ మహిళను మాత్రం కేవలం బాధితురాలిగా మాత్రమే పరిగణించి ఎలాంటి కేసును నమోదు చేసేవారు కాదు. ఈ సెక్షన్ చెల్లుబాటును విచారించాలని షైనే జోసఫ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
 
దీనిపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత కొన్ని రోజులుగా వాదనలు ఆలకిస్తోంది. ఈ వాదనలను ఆలకించిన ధర్మాసనం... వివాహేతర సంబంధం స్త్రీ, పురుషుల అవసరార్థం ఏర్పడుతుందని, విడాకులు తీసుకోవాలని భావించే వారు మరొకరితో సంబంధం పెట్టుకుంటే చెల్లుబాటు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. 
 
చీఫ్ జస్టీస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ, 'ఇది మహిళలకు రక్షణగా, వివాహేతర సంబంధాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తోందే తప్ప, వాస్తవానికి ఇది మహిళా వ్యతిరేక సెక్షన్. భర్త చెప్పుచేతల్లోనే భార్య ఉండాలని చెప్పకనే చెబుతోంది. మరో వ్యక్తితో సంబంధానికి భర్త అనుమతి తప్పనిసరని కూడా చెబుతున్నట్టు ఉంది' అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. పైపెచ్చు.. సెక్షన్ 497కు సవరణలకు సూత్రప్రాయంగా సమ్మతం తెలిపినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యతో సర్పంచ్‌తో అక్రమ సంబంధం.. భర్త న్యాయ పోరాటం