Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం : రివ్యూకు సుప్రీం ఓకే...

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది.

Advertiesment
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం : రివ్యూకు సుప్రీం ఓకే...
, మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (13:18 IST)
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై ఓపెన్ కోర్టు విచారణకు సుప్రీం అంగీకారం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కీలక నిబంధనలు మార్చడంపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ చట్టంలోని ఏ నిబంధనలను సడలించినా ఈ తీర్పు రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘిస్తున్నదని కేంద్రం గుర్తు చేసింది. 
 
కాగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం-1989 కింద ఆరోపణలు ఎదుర్కొనేవారిని తక్షణం అరెస్టు చేయాలన్న నిబంధనను సడలిస్తూ మార్చి 20న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది.
 
ఈ బంద్ హింసాత్మకంగా మారింది. ఆందోళనల్లో 9 మంది నిరసనకారులు ప్రాణాలుకోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో ఆరుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్థాన్‌లో ఒకరు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ, గుజరాత్, బీహార్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య సమ్మతి లేకుండా శృంగారంలో పాల్గొంటే తప్పులేదు : గుజరాత్ హైకోర్టు