Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజాకు ఏమైంది.. పీకేని పొగిడేస్తోందన్న శ్రీరెడ్డి.. పవన్‌కు నాలుగో భార్యగా?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై.. శ్రీరెడ్డి మరోసారి టార్గెట్ చేసుకుంది. పవన్ పెళ్లిళ్ల గురించి మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో ఏకేసిన శ్రీరెడ్డి.. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్‌ రోజాపై ధ్వజమెత్

రోజాకు ఏమైంది.. పీకేని పొగిడేస్తోందన్న శ్రీరెడ్డి.. పవన్‌కు నాలుగో భార్యగా?
, మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (13:00 IST)
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై.. శ్రీరెడ్డి మరోసారి టార్గెట్ చేసుకుంది. పవన్ పెళ్లిళ్ల గురించి మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో ఏకేసిన శ్రీరెడ్డి.. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్‌ రోజాపై ధ్వజమెత్తింది. సినీ నటి రోజా, గతంలో తెలుగుదేశం పార్టీలో కొంతకాలం ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోజా చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. 
 
దాదాపు 30 సెకన్ల నిడివి వున్న ఈ వీడియోలో రోజా, అప్పట్లో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను ప్రస్తావిస్తూ, కాస్టింగ్ కౌచ్‌పై  రోజా కామెంట్స్ చేసింది.  మహిళా నటులు అంత చులకనగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించిన రోజా, వేషాలు ఇచ్చేందుకు ఎంతమందితో మీరు, మీ తమ్ముడు... అంటూ రెచ్చిపోయారు.

అప్పట్లో టీడీపీలో వున్న రోజా సూపర్‌గా మహిళా సమస్యలపై నోరెత్తారని.. ఆమె డేరింగ్‌కు తాను ఫిదా అయ్యానని శ్రీరెడ్డి తెలిపింది.  కానీ ఈ మధ్య ఏమైందో అర్థం కావట్లేదు. పీకేని తెగ పొగిడేస్తున్నారని మండిపడ్డారు. ఆమె జై జగన్ అన్నా అని పొగిడితే చాలని ఆ వీడియోకు శ్రీరెడ్డి తన కామెంట్‌ను జోడించింది.  
 
మరోవైపు పవన్‌ను ఎప్పటికీ ప్రేమిస్తూనే వుంటానని చెప్పిన మాధవీలతపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. నెటిజన్లు మాధవీలత పవన్‌కు నాలుగో భార్య కాబోతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో పదో తరగతిలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్‌ను లవ్ చేశానని.. ఎవరో వచ్చి ఏదో చేస్తారంటే తన ప్రేమ పోదని.. పవన్‌ను ఎప్పుడూ ప్రేమిస్తూనే వుంటానని మాధవీలత చెప్పింది. అది ఆయనకు చెప్పే అవసరం కూడా తనకు లేదు. నా ప్రేమ నా ఇష్టం అంటూ.. మాధవీలత పోస్టు చేసింది. 
 
ఈ పోస్టుపై పవన్‌కు మాధవీలత నాలుగో భార్య కాబోతుందని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. పవన్‌కు నాలుగో భార్యనా? ఏంటి సామీ మీ గోల..? పవన్‌ను తనకంటే ఎక్కువ ప్రేమించే వాళ్లున్నారు. అలాంటి మాటలతో అని పవన్ కల్యాణ్‌ను అవమానించవద్దు. పవన్ అంటే ఇష్టమన్న మాత్రాన నష్టం లేదు. తన ప్రేమ ఎలాంటి స్వార్థం లేనిదని మాధవీలత తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకంజ... ఎందుకంటే?