Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కూటీపై నాగుపాము.. క్షణాల్లో వచ్చిన మహిళ.. చేతిలో పట్టుకుని..?

Advertiesment
Snake
, మంగళవారం, 2 మార్చి 2021 (15:29 IST)
స్కూటీపై బల్లి వుంటేనే ఆమడ దూరం పరిగెత్తే వారిని చూసివుంటాం. అలాంటిది పాము కనిపిస్తే.. ఇంకేమైనా వుందా అంతే సంగతులు. అలాంటిది ఓ మహిళ మాత్రం ఐదడగుల పామును చేత్తో పట్టుకుని తీసిపారేసింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని భువనేశ్వర్‌లో‌ ఉండే స్వరూప భట్నాగర్‌ బయటకు వెళ్దామని ఇంటి తలుపు తీసింది. సరిగ్గా అప్పుడే అనుకోని అతిథి ఇంటికి రావడాన్ని చూసి షాక్‌కు గురైంది. 
 
ఆ అతిథి ఎవరో కాదు.. ఐదు అడుగుల నాగుపాము. దాని భయంతో ఇంట్లోనే ఉండిపోయిన ఆమె ఆ సర్పం అక్కడ నుంచి వెళ్లిపోయిందా? లేదా? అని కిటికిలో నుంచి తొంగి చూసింది. ఆ నాగుపాము బయట పార్కింగ్‌ చేసిన ఒక స్కూటీపై ఎక్కి పడగ విప్పింది. ఇది గమనించిన స్వరూపభట్నాగర్‌ వెంటనే, స్నేక్‌ క్యాచర్‌ సుబేందు మల్లిక్‌కు సమాచారం అందించింది.
 
పాములను పట్టుకొవడంలో మంచి ఎక్స్‌పర్ట్‌ అయిన సుబేంద్‌ క్షణాల్లో అక్కడకు చేరుకుంది. బుసలు కొడుతున్న నాగుపామును ఒక కర్ర సహయంతో పట్టుకుని అటవీ ప్రదేశంలో వదిలేసింది. దీంతో స్వరూప హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. 
 
ఈ సందర్భంగా సుబేందు మాట్లాడుతూ.. శీతాకాలంలో ఉన్న పాము ఆహారం కోసం బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆ పాము ఏమీ తినలేదు. అందుకే చాలా వీక్‌గా ఉందని చెప్పారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెదేపా దుకాణం మూసేస్తామంటున్న బుద్ధా వెంకన్న!