టీవీ షోలో నందిని.. భర్త ఆత్మహత్య వార్త.. నో రియాక్షన్.. రెండో పెళ్లికి సిద్ధం

శుక్రవారం, 7 జూన్ 2019 (18:08 IST)
తమిళ బుల్లితెర నటి మైనా నందిని రెండో పెళ్లికి సిద్ధమైంది. కుటుంబ కథా పాత్రల్లో నటిస్తూ, అచ్చం విలేజ్ అమ్మాయిలా ప్రేక్షకులను ఆకట్టుకున్న మైనా నందిని.. సినిమాల్లో నటించింది. సీరియళ్లు, సినిమాల్లో నటిస్తూ నటనతో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న నందిని.. కార్తీక్ అనే జిమ్ మాస్టర్‌ను కొన్నేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకుంది.
 
కానీ వివాహ జీవితం ఆమెకు అంతగా సెట్ కాలేదు. భర్తతో విబేధాలు, మనస్పర్ధలు, అత్తమామల చేతుల్లో వేధింపులు తప్పలేదు. ఈ భార్యాభర్తల గొడవల్లో తీవ్ర మనస్తాపానికి గురైన నందిని బర్త కార్తీ రెండేళ్ల క్రితం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
అయితే భర్త ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం.. నందిని ఓ షోలో పాల్గొన్న సందర్భంగా లైవ్‌లో వచ్చినా.. ఆమెలో కాసింతైనా దుఃఖం కనిపించలేదు. షోలో పాల్గొన్నప్పుడు భర్త చనిపోయాడనే వార్తకు ఆమె ఏమాత్రం రియాక్ట్ కాలేదు. భర్త చనిపోయిన కొద్దినెలలకే నందిని తిరిగి యధావిధిగా సినిమాలు, సీరియళ్లలో బిజీ అయిపోయింది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో నందిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఓ డ్యాన్స్ మాస్టర్‌తో నందిని ప్రేమలో పడిందని టాక్. ఈ విషయాన్ని నందిని కూడా ఇటీవల ధ్రువీకరించింది. తాను ఓ సీరియల్ నటుడిని ప్రేమిస్తున్నట్లు ఒప్పేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సర్.. మీరే నాకు నాయకుడు.. మీతోనే ఉంటా : జనసేన ఎమ్మెల్యే రాపాక