క్రిస్మస్ తాత వేషంలో మంత్రి రోజా సెల్వమణి అలరించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని
ఓ పేద కుటుంబానికి చెందిన ఇద్దరు చిట్టి తల్లులకు రోజా భరోసా ఇచ్చారు. మనిషి యొక్క ఎదుగుదలకి అంగవైకల్యం అడ్డంకి కాదనే విధంగా జీవితంలో ఎక్కడా ఓడిపోకుండా తన శ్రమనే నమ్ముకొని కుటుంబానికి అండగా నిలిచిన విజయవాడకి చెందిన నాగరాజును రోజా కలిశారు. క్రిస్మస్ తాత వేషంలో ఆయన ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
నాగరాజు జీవిత కథ తనను ఎంతగానో కదిలించిందని.. అందుకే ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు వెళ్లినట్లు రోజా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. నాగరాజు కుటుంబ బాధ్యతకు అచ్చెరువు చెందానని.. అందుకే అతని కుటుంబ భాద్యతలో తనవొంతు సాయం చెయ్యాలని, ఆయన భార్య ఇద్దరు చిన్నారి ఆడపిల్లల భవిష్యత్తుకి భరోసా నిస్తున్నట్లు తెలిపారు.
సీఎం జగన్ (అన్న) పుట్టినరోజు సందర్భంగా ఈ కుటుంబంలో సంతోషం నింపడానికి ఈ చిన్న ప్రయత్నం చేసినట్లు రోజా వెల్లడించారు. ఈ సందర్భంగా నాగరాజు కుటుంబంలో ఆమె గడిపిన క్షణాలను ఫోటోలు, వీడియోలను నెట్టింట పోస్టు చేశారు. ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.