Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

ఇదేం పని మంత్రిగారూ... సీఎం బ్యానర్ ముందే మూత్రం పిచికారి!

Advertiesment
rajasthan minister
, సోమవారం, 8 అక్టోబరు 2018 (16:42 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా, ఈ పథకం కోసం మోడీ సర్కారు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రకటనల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తోంది. అయితే, అధికారంలో ఉండే పాలకులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. తమపని తాము చేసుకుని ముందుకెళుతున్నారు.
 
తాజాగా రాజస్థాన్ రాష్ట్రానికి మంత్రి శంభూ సింగ్ ఖటేసర్ ఏకంగా బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు. మూత్రాన్ని నిలుపుకోలేక ఆయన ఈ పని చేసివుండొచ్చు. కానీ, ఆయన ఎంచుకున్న ప్రదేశం మాత్రం అందుకు ఏమాత్రం సరైంది కాదు. ఎందుకంటే.. ఆయన పిచికారి చేసింది ముఖ్యమంత్రి బ్యానర్ ముందే పిచికారి చేసి ప్రతి ఒక్కర్నీ అవాక్కయ్యేలా చేశారు. ఫలితంగా స్వచ్ఛ భారత్ ఆశయానికి ఆయన నిలువునా తూట్లు పొడిచారు. 
 
మంత్రి చేసిన నిర్వాకంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ఫొటో వైరల్ కావడంతో మంత్రి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. అయితే మంత్రి తాను చేసిన పనిని పాత పద్ధతినే పాటించానంటూ సమర్థించుకోవడం కొసమెరుపు. తాను గోడ చాటుగానే పోశానని, సీఎం పోస్టర్ దగ్గరలో పోయలేదని శంభూ చెప్పుకొచ్చారు. అయినా.. దీన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని.. తాను నిర్మానుష్య ప్రదేశంలోనే మూత్ర విసర్జన చేశానని.. ఇలాంటి ప్రదేశాల్లో పోసినంత మాత్రాన వ్యాధులు సోకవని మంత్రి శంభూ సింగ్ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జస్టిస్ ఫర్ ప్రణయ్-అమృతవర్షిణిని అలా కామెంట్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు..