Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీరేమీ చ‌క్ర‌వ‌ర్తులు కాదు, అధికారుల‌ను కోర్టుకు పిల‌వ‌డానికి...

మీరేమీ చ‌క్ర‌వ‌ర్తులు కాదు, అధికారుల‌ను కోర్టుకు పిల‌వ‌డానికి...
, శనివారం, 10 జులై 2021 (15:39 IST)
ప్రభుత్వ అధికారుల్ని అనవసరంగా కోర్టులకు పిలవొద్దు...అని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రత్యేక‌ బెంచ్ ఆదేశించింది. మీరేమీ చక్రవర్తులు కారు...అలా పిలవటం వల్ల మీ గౌరవం పెరిగిపోదు! మీకు నచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు నడవాలనుకోవద్దు. కొన్ని హైకోర్టులకు ఇది అలవాటైపోయింది. న్యాయ,శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు పరిధులున్నాయ్.
ఒకరి అధికారాల్ని మరొకరు ఆక్రమించాలనుకోకూడదు...అని ధ‌ర్మాస‌నం హిత‌వు చెప్పింది. 
 
భారత రాజ్యాంగంలోని శాసన, న్యాయ, అధికార, వ్యవస్థలు మూడు సమానమేనని, ఒకరి పరిధిలో మరొకరు జోక్యం చేసుకోవడం సరికాదని వెల్లడించింది. ప్రభుత్వా ఆధికారుల నిర్ణయాలు ప్రజల కోసమే.. సొంతానికి కాదు అని గౌరవ కోర్టులు గుర్తుపెట్టుకోవాల‌ని సుప్రీం కోర్టు ప్ర‌త్యేక బెంచ్ పేర్కొంది.

జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ఇ ద్దరికీ వేరువేరు విధాలుగా అధికారాలు ఉన్నాయని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇరుకున పెట్టేలా కోర్టులు వ్యవహరించవద్దని ప్రత్యేక ధర్మాసనం స్పష్టం చేసింది. అవి తప్పు అనిపిస్తే వాటిని కొట్టేసే హక్కు కోర్టులకు ఎక్కడుంది. దానిపై తీరని సందేహాలుంటే మీ ఉత్తర్వుల్లో వాటిని స్పష్టంగా రాయండి. తగిన సమయమిచ్చి ప్రభుత్వం నుంచి సమాధానం తీసుకోండి.

అంతే తప్ప అధికారుల్ని పదేపదే పిలిచి, మీ గౌరవం తగ్గించుకోవద్దు. ఇదెంత మాత్రం హర్షణీయం కాదు... ప్రభుత్వ అధికారుల్ని ఇష్టానుసారం, అనవసరంగా హైకోర్టుకు పిలవటం అంటే ఆ ఉద్యోగి విధులకు భంగం కలిగించినట్లేనని పేర్కొంది. దీని వల్ల అంతిమ భారం ప్రజలపైనే పడుతుందని, అధికారులపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మార్గనిర్దేశకాలు జారీ చేస్తున్న‌ట్లు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హేమంత్ గుప్తలతో కూడిన ప్రత్యేక బెంచ్ ప్రకటన విడుదల చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి ఆపివేత