న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌కు చెందిన ఓ గర్బిణీ పుష్ప సినిమాలోని సామీ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ఇంటర్నెట్‌ను ఈ డ్యాన్స్ బాగానే షేక్ చేస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సాంగ్ చాలా రోజులుగా ట్రెండింగ్‌లో ఉందని, కానీ తాను కొంచం లేట్‌గా డ్యాన్స్ చేశానని వెల్లడించింది.
పుష్ప సినిమాను చూడలేదని, సమయం దొరకలేదని, ఈ వీక్‌లోనే సినిమా చూస్తానని పోస్ట్ చేసింది. గర్భవతిగా ఉండి కూడా సాంగ్‌కు డ్యాన్స్ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు
ఇకపోతే.. ఈ సాంగ్ ఖండాంతరాలు దాటిపోయింది. విదేశీయులను సైతం ఆకట్టుకుంటోంది. ఇప్పటికే దేశంలో ఈ పాట ట్రెండింగ్‌లో వుంది. ఈ పాటకు సామాన్యుల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.