ఉగ్రవాదులకు అడ్డాగా మమారిన పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వధానం చేసకోవడమే తలక్ష్యమని భారత ఆర్మీ చీప్ బిపిన్ రావత్ ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రమంటే పీవోకే లేని రాష్ట్రంకాదన్నారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, అందులో పాకిస్థాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ కూడా దాగవుందన్నారు. జమ్మూకశ్మీర్ అంటే పీవోకేతో పాటు గిల్గిత్ బల్టిస్తాన్ కూడా అందులోనే వస్తాయని, ఇప్పుడా ప్రాంతాన్ని పొరుగువారు అక్రమంగా కబ్జా చేశారన్నారు.
అందువల్ల ఇకపై దాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా తమ వ్యూహాలు ఉంటాయన్నారు. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతం ఇప్పుడు ఆ దేశం ఆధీనంలో లేదని, ఆ ప్రాంతాన్ని ఉగ్రవాదులు పాలిస్తున్నారన్నారు. పీవోకే ప్రాంతాన్ని ఉగ్రవాదులు ఏలుతున్నారని.. అది పాకిస్థాన్‌లో ఉగ్రవాద నియంత్రిత ప్రాంతమన్నారు. అందువల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా తమ ప్రణాళికలు ఉంటాయన్నారు.
ఈ ఏడాది చివరి కల్లా భారత ఆర్మీకి.. అమెరికా రైఫిళ్లు అందుతాయన్నారు. అమెరికాకు చెందిన సిగ్ సావర్ రైఫిళ్లు.. ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని, ఆ రైఫిళ్లను ఈ యేడాది చివరి కల్లా భారత ఇన్‌ఫాంటరీ దళాలకు చేరుతాయని రావత్ స్పష్టం చేశారు.