సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ ఇరుక్కున్న ఘటనపై వార్తలు వస్తూనే వున్నాయి. ఈ విషయమై ఇప్పటికే చాలా మంది స్పందించారు. రాజకీయ నాయకులు సైతం ఈ విషయమై మాట్లాడుతూ వచ్చారు. ఈ విషయం లీగల్ పరిధిలో ఉండటంతో మరికొందరు మాట్లాడటానికి ఇష్టపడలేదు. చిరంజీవి, నాగబాబు వంటి వారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు ఆయన ఇంటికి వెళ్లారు కానీ, ఎక్కడా కూడా ఈ ఘటనపై స్పందించలేదు.
అయితే శనివారం పవన్ కళ్యాణ్‌ని స్పందించమని మీడియావారు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కడప పర్యటనలో భాగంగా వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఎంపీడీఓ జవహార్ బాబును పరామర్శించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో.. "అల్లు అర్జున్ అరెస్ట్ విషయమై దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి?" అని అడగగా, దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విషయం ఏమిటి..?, హాస్పిటల్ దగ్గర మీరు ఇలాంటి ప్రశ్నలా అడిగేది. ఈ ఘటనపై సంబంధిత ప్రశ్నలు మాత్రమే వెయ్యండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.