Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాఫియా లీడర్లు మాటిస్తే నిలబడతారు.. కానీ రాజకీయ నేతలు : పవన్ కళ్యాణ్

మన రాజకీయ నేతల వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మాఫియా లీడర్లు మాట ఇస్తే నిలబడతారని, కానీ మన రాజకీయ నేతలు మాటపై చివరి వరకు నిలబడతారన్న నమ్మకం లేదని అన్నారు. ఆయన బుధవారం మీ

Advertiesment
మాఫియా లీడర్లు మాటిస్తే నిలబడతారు.. కానీ రాజకీయ నేతలు : పవన్ కళ్యాణ్
, బుధవారం, 7 మార్చి 2018 (14:39 IST)
మన రాజకీయ నేతల వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మాఫియా లీడర్లు మాట ఇస్తే నిలబడతారని, కానీ మన రాజకీయ నేతలు మాటపై చివరి వరకు నిలబడతారన్న నమ్మకం లేదని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. 
 
అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడం మంచి పరిణామవని అన్నారు. 2014లో తనను వాడుకుని వదిలేశారని అనుకుంటున్నానని... 2019లో తన వైఖరి ఏంటో గుంటూరు సభలో చెబుతానని తెలిపారు. కేంద్ర మంత్రులు ఇప్పుడు రాజీనామా చేస్తే వస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. 
 
అదేసమయంలో ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో అంత లొల్లి జరుగుతున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఢిల్లీకి వెళ్లి, పోరాటం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకుంటే ఉత్తర, దక్షిణ భారత్‌లో తేడాలు వస్తాయనే విషయాన్ని గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరించారనని పవన్ గుర్తు చేశారు.
 
విభజన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే తెలంగాణ ఉద్యమకారులు, గుజ్జర్లు పోరాడినవిధంగా ఉద్యమం చేయాల్సి ఉంటుందన్నారు. అయితే, కేసులున్నాయని టీడీపీ, వైసీపీ నేతలు భయపడుతున్నారని చెప్పారు. తన వద్దకు కూడా ఐటీ అధికారులను పంపించారని, అయినా ఏం చేశారని గుర్తు చేశారు.
 
ఇకపోతే, మూడో కూటమి అనేది కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసమని అందరూ అనుకుంటున్నారని... ప్రాంతీయ పార్టీలు స్వతంత్రంగా వ్యవహరించడానికే థర్డ్ ఫ్రంట్ అని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఇపుడు ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజీనామాలకు సిద్ధంగా ఉండండి... బీజేపీ హైకమాండ్ ఆదేశం