Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలకలం రేపుతున్న ఏవై 4.2 వేరియంట్.. తెలుగు రాష్ట్రాల్లో...

కలకలం రేపుతున్న ఏవై 4.2 వేరియంట్.. తెలుగు రాష్ట్రాల్లో...
, గురువారం, 28 అక్టోబరు 2021 (12:12 IST)
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఏవై 4.2 కరోనా వేరియంట్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించింది. తెలంగాణా రాష్ట్రంలో 48 ఏళ్ల పురుషుడు, 22 ఏళ్ల యువతికి ఏవై 4.2 వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే, కొత్త వేరియంట్‌పై వైద్యాధికారులు గోప్యత పాటిస్తున్నారు. 
 
అయితే రాష్ట్రంలో బయటపడిన రెండు ఏవై.4.2 బాధితుల వివరాలను గోప్యంగా ఉంచారు. వారు ఇప్పుడెలా ఉన్నారు? వారికి కరోనా పూర్తిగా నయమైందా? ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన చర్యలేంటన్న విషయాలపై స్పష్టత లేదు. 
 
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తోంది. తెలంగాణ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుత డెల్టా వెరియెంట్‌తో పోలిస్తే 15 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా, కేరళ రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 
 
డెల్టా వేరియంట్‌ ప్రపంచాన్ని వణికించిన విషయం విదితమే. తెలంగాణలోనూ సెకండ్‌ వేవ్‌లో డెల్టాతో వేలాది మంది కరోనా బారినపడగా, వందలాది మంది చనిపోయారు. 
 
కాగా డెల్టా వేరియంట్‌లో మూడు ఉప వర్గాలున్నాయి. వాటిలో 67 రకాల స్ట్రెయిన్లు ఉన్నాయి. అందులో ‘ఏవై.4.2’రకం ఒకటి. దీనిలో మిగతా వాటితో పోలిస్తే అదనంగా రెండు మ్యుటేషన్లు ఉన్నాయి.
 
ఏ222వీ, వై145హెచ్‌ అనే ఈ మ్యుటేషన్లు ఉండటమే దీనికి, డెల్టా వేరియంట్‌కు ప్రధానమైన తేడాగా చెబుతున్నారు. ఇక ఏవై.4.2 డెల్టా వేరియంట్‌ వైరస్‌తో పోలిస్తే, 12.4 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నిర్ధారిం చారు. 
 
కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్నాయని యూకే చెబుతుండగా, డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం కేసులు పెరుగుతున్నాయే కానీ, మరణాలు పెద్దగా లేవని చెబుతుండటం కొంత ఊరటనిస్తోంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్ర హోం మంత్రికి కరోనా పాజిటివ్