Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిస్ యూనివర్స్‌తో స్టేజి పైన పిల్లిలా 'మియావ్ మియావ్' అనిపిస్తావా? స్టీవ్‌పై ఫైర్

Advertiesment
మిస్ యూనివర్స్‌తో స్టేజి పైన పిల్లిలా 'మియావ్ మియావ్' అనిపిస్తావా? స్టీవ్‌పై ఫైర్
, శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:42 IST)
Photo: Girish Srivastav
గత వారం ఇజ్రాయెల్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీ ఈవెంట్‌లో మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధును పిల్లిలా అరవాలంటూ అడిగి, ఆమెతో అలా చేయించినందుకు, మిస్ యూనివర్స్ హోస్ట్ స్టీవ్ హార్వేను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఆదివారం నాడు, మిస్ యూనివర్స్ పోటీదారులను వారి విజయాల గురించి అడుగుతూ హర్నాజ్‌ను ఆశ్చర్యపరిచాడు స్టీవ్. ఏమన్నాడంటే... "మీరు జంతువుల అరుపులను అనుకరించడంలో చాలా నేర్పరి అని విన్నాను. మీకు ఇష్టమైన జంతువు అరుపు అరవండి."
webdunia

 
హర్నాజ్ నవ్వుతూ, "ఓ మై గాడ్, స్టీవ్, నేను ప్రపంచ వేదికపై ఇలా చేయాల్సి వస్తుందని ఊహించలేదు. మీరు అడిగారు కనుక నేను దీన్ని చేయాలి, నాకు వేరే మార్గం లేదు." అంటూ ఆ తర్వాత పిల్లిలా మియావ్... మియావ్ అంటూ అరవడం ప్రారంభించింది. స్టీవ్ ఆ తర్వాత ముందుకు వెళ్లి ఇతర పోటీదారులకు ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు.
webdunia
స్టీవ్ చర్యపై ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “వాట్ ఇన్ ది లివింగ్ హెల్? ఇతర పోటీదారులను వారి విజయాల గురించి అడిగినప్పుడు, మిస్ ఇండియా హర్నాజ్ సంధును మాత్రం జంతువులా అరవమంటారా? ఆమెనూ ఆ ప్రశ్న ఎవరు వేయాలని అడిగారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను? అంటూ జోడించాడు.

 
ఇకపోతే మిస్ యూనివర్స్ హర్నాజ్ ముంబై చేరుకుంది. ఆమెకి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి సభకు వచ్చిన ఆర్ఆర్ఆర్ - ఘన స్వాగతం పలికిన రైతులు