Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎద్దు ముందు నిలబడి రెచ్చగొట్టాడు... అంతే చుక్కలు చూపించింది.. వీడియో వైరల్

Advertiesment
Bull
, మంగళవారం, 16 ఆగస్టు 2022 (17:11 IST)
Bull
సాధారణంగా క్రూర జంతువులు, సాధువుగా వుండే జంతువులు వున్నాయి. అయితే సాధు జంతువులను రెచ్చగొడితే మాత్రం అవి దాడికి పాల్పడతాయని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా ఓ వ్యక్తి ప్రశాంతంగా ఉన్న ఎద్దు ముందు వెకిలి చేష్టలు చేశాడు. దీంతో చావు రుచి చూపించింది.  
 
ఈ వీడియోలో ఉత్సవంలో భాగంగా ఖాళీ ప్రదేశంలో ఎద్దు కొమ్ములకు నిప్పు పెట్టి వదిలేశారు. చుట్టు భారీ సంఖ్యలో ప్రజలు ఉండి అరుస్తున్నప్పటికీ ఆ ఎద్దు ప్రశాంతంగా ఉంది. అయితే దాని ముందు నిల్చున్న వ్యక్తి మాత్రం.. తన మాటలు.. చేష్టలతో ఆ ఎద్దును రెచ్చగొట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎద్దు అతని వెంట పరిగెత్తడంతో అతడు ముందు ఉన్న స్టెప్స్ పైకి పారిపోయాడు. 
 
అయినా వదలని ఎద్దు.. అతడిని తన కొమ్ములతో ఎత్తి పడేసింది. దీంతో అతడు మెట్లపై పడి ఆ తర్వాత నేలపై స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియోను డార్విన్ అవార్డ్స్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాఠశాలల ముందు సెల్ఫీల కోసం కుస్తీ పడుతున్న టీచర్స్: వింతగా చూస్తున్న విద్యార్థులు