Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైద్య చరిత్రలోనే అద్భుతం... తొలిసారి కూడా.. మగబిడ్డకు 3 జననాంగాలు!!!

వైద్య చరిత్రలోనే అద్భుతం... తొలిసారి కూడా.. మగబిడ్డకు 3 జననాంగాలు!!!
, ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (08:07 IST)
వైద్య చరిత్రలోనే ఓ అద్భుతం చోటు చేసుకుంది. పైగా, ఇలా జరగడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల ఇరాక్‌లో జన్మించిన ఓ మగబిడ్డకు మూడు జననాంగాలు ఉన్నాయి. ఇలాంటి పుట్టుక అరుదైనదిగా వైద్యులు చెబుతున్నారు. బిడ్డ పుట్టిన మూడు నెలల అనంతరం..  తల్లిదండ్రులు చిన్నారి జననాంగాల వద్ద వాపు ఉన్నట్టు ఇటీవల గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించారు. 
 
చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ప్రధాన అంగానికి సమీపంలో మరో రెండు మర్మాంగాలు బయటకువస్తున్నట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో రిసేర్చ్ పేపర్ ఇంటర్నేషన్ జర్నల్‌ ఆఫ్ సర్జరీ కేస్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ట్రైఫాలియా అంటారని రీసెర్చ్ పేపర్‌ను ప్రచురించిన వైద్యులు షకీర్ సలీమ్ జబాలీ, అయ్యద్ అహ్మద్ మొహ్మద్ తెలిపారు.
 
'తమకు తెలిసినంత వరకూ మనుషుల్లో ఇటువంటి కేసు వెలుగు చూడటం ఇదే తొలిసారి' అని వారు వ్యాఖ్యానించారు. ప్రతి 50 లక్షల ప్రసవాల్లో ఒకసారి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 
కడుపుతో ఉన్న సమయంలో ఆ బిడ్డ తల్లికి ఎటువంటి హానికారక మందులూ తీసుకోలేదని, అంతేకాకుండా.. వారి వంశం చరిత్ర పరిశీలించినా కూడా ఎటువంటి జన్యుసమస్యలూ బయటపడలేదని అక్కడి డాక్టర్లు తెలిపారు. 
 
అయితే.. పురుషాంగానికి అనుబంధంగా ఉండే యూరెత్రా అనే గొట్టం రెండు జననాంగాల్లో లేకపోవడంతో వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారట. ఇక అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఉదంతాన్నే ప్రపంచంలోని తొలి ట్రైఫాలియాకేసుగా పరిగణించాల్సి ఉంటుంది. 
 
2015లో భారత్‌లో ఇటువంటి కేసు ఒకటి వెలుగు చూసినప్పటికీ.. అది మెడికల్ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో ఇరాక్ బాలుడు ఉదంతాన్నే తొలికేసుగా పరిగణించాల్సి ఉంటుందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రత్నప్రభ... అభివృద్ధి సిరాచుక్క