ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల తెలంగాణలో ప్రాంతీయ పార్టీని ప్రారంభించాలని యోచిస్తున్నారా? రాష్ట్రంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపచేయడానికి ఆమె సిద్ధమవుతున్నారు?
నగరంలోని లోటస్ పాండ్ నివాసంలో మంగళవారం నల్గొండకు చెందిన నాయకులతో ఆమె సమావేశం అయ్యారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
మొదటి సమావేశం ఉదయం 10 గంటలకు నల్గొండ జిల్లా నాయకులతో జరిగింది. దివంగత వై.ఎస్.రాశశేఖరరెడ్డి అనుచరులతో ఈ సమావేశాన్ని ఆత్మియ సమ్మేళనం (స్నేహపూర్వక సమావేశం) అని చెప్పారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... అభిమానులకు చెప్పకుండా పార్టీ పెట్టను. అన్ని జిల్లా వాళ్లతో మాట్లాడుతా. నల్గొండతో పాటు ప్రతి జిల్లా నేతలను కలుస్తా. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా అని అన్నారు.