అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సందర్భంగా సూర్య గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తి చూపారు. సూర్యగ్రహణం మన దేశంలో పాక్షికంగా ఏర్పడినా.. విదేశాల్లో సూర్యగ్రహణాన్ని పూర్తిస్థాయిలో వీక్షించారు ప్రజలు. తాజాగా సూర్యగ్రహణం సమయంలో ఎమిరేట్స్ విమానం సూర్యుడిని దాటుతున్నట్లు ఉక్రెయిన్ ఫోటోగ్రాఫర్ తీసిన వీడియో వైరల్‌గా మారింది.
సోమవారం సూర్యగ్రహణం సంభవించినందున, భారతదేశం సహా కొన్ని దేశాల నుండి ఈ గ్రహణాన్ని చూసే అవకాశం ప్రజలకు లభించింది. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, మంగళూరు, చెన్నై, తిరువనంతపురం, కోయంబత్తూర్, ఊటీ తదితర ప్రాంతాల్లోని ప్రజలు 18% నుంచి 25% వరకు సూర్యగ్రహణాన్ని వీక్షించారు.
సూర్యగ్రహణం సమయంలో సూర్యునికి ఎదురుగా విమానం ప్రయాణిస్తున్న అరుదైన దృశ్యాన్ని ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఫిలిప్ సాల్గెబర్ అనే ఖగోళ ఫోటోగ్రాఫర్ విమానం ప్రయాణిస్తున్న వీడియోను తీశాడు.
గ్రహణం సమయంలో పారిస్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎమిరేట్స్ ఏ380 ఏ6 విమానం సూర్యుడి ముందు నుంచి వెళ్లిందని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
అలాగే చెన్నైకి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ కూడా గ్రహణం సమయంలో సూర్యుడిని దాటుతున్న విమానాన్ని చిత్రీకరించారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.