Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెల్లారి 4 గంటలకే బిర్యానీ రెడీ.. మాదాపూర్‌లో నయా ట్రెండ్

Advertiesment
Biryani
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని సందడిగా ఉండే వీధులలో బిర్యానీ సువాసన వెదజల్లుతోంది. తెల్లవారుజామున తాజాగా తయారు చేసిన టీ సువాసనతో మాత్రమే కాకుండా, బిర్యానీ వాసన ముక్కులను కట్టిపడేస్తోంది.  
 
హైదరాబాద్ నగరంలో తెల్లవారుజామున 4 గంటలకు బిర్యానీ స్టాల్స్ పెరిగిపోతున్నాయి. దీంతో నాలుగు గంటలకే బిర్యానీ లభిస్తోంది. హైదరాబాద్‌ బిర్యానీకి బాగా ఫేమస్. బిర్యానీని ఆస్వాదించడానికి అక్కడి ప్రజలు ఆసక్తి చూపుతారు. 
 
ఈ స్టాల్ యజమానులు ఉదయం 4 గంటలు కొట్టగానే బిర్యానీ వడ్డించడానికి అర్ధరాత్రి వంట చేయడం ప్రారంభిస్తారు. సూర్యుడు ఉదయించే సమయానికల్లా బిర్యానీ సిద్ధమైపోతుంది. ఇంకా కొన్ని గంటల్లోనే వేలాది మంది వినియోగదారులు బిర్యానీ కొనేస్తున్నారు. 
 
సందడిగా ఉండే హాట్‌స్పాట్‌లలో ఒకటి శాంతా 4 AM బిర్యానీ. ఇది వివేకానందనగర్‌లోని ఒక స్టాల్, ఇది ఉదయం 4 నుండి 8 గంటల వరకు పనిచేస్తుంది. వేలాది మంది ఈ స్టాల్ నుంచి రోజూ బిర్యానీ కొంటూ వుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలివేటడ్ కారిడార్‌తో ట్రాఫిక్‌కు చెక్: కండ్లకోయలో సీఎం శంకుస్థాపన