ఇటీవలే చెన్నైకు చెందిన 100 మంది తమ ఖాతాల్లో కోట్లకొద్దీ డబ్బు క్రెడిట్ కావడం చూసి షాక్ తిన్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
ఇదిలావుండగానే తాజాగా తెలంగాణలో వికారాబాద్ HDFC బ్యాంకు ఖాతాదారుడి ఖాతాలో ఏకంగా రూ. 18.52 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అతడికి మెసేజ్ కూడా వచ్చింది. దీనితో షాక్ తిన్న ఖాతాదారుడు వెంటనే బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. సర్వర్లలో కొత్త సాఫ్ట్వేర్ ఇన్‌స్టాల్ చేయడంతో ఇలాంటి సమస్య తలెత్తిందని వారు చెపుతున్నారు.
ఐతే పెద్దమొత్తంలో తన ఖాతాలో క్రెడిట్ కావడంతో బ్యాంకు ఖాతాదారుడు ఫెడరల్ క్రైమ్ అండ్ బ్యాంక్ ఫ్రాడ్ విభాగానికి రిపోర్ట్ చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.