Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన ప్రమాదం.. విమానం చక్రం ముందు కారు ..

gofirstcar
, మంగళవారం, 2 ఆగస్టు 2022 (15:45 IST)
ఇటీవలి కాలంలో దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థలకు తృటిలో పెనుప్రమాదాలు తప్పుతున్నాయి. ఈ వరుసలో స్పైస్ జెట్, ఇండిగో విమానాలు ఉన్నాయి. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానాశ్రయంలో టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా.. మరో విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు చెందిన కారు ఒకటి దాని కిందకు దూసుకొచ్చింది. విమానం చక్రాన్ని ఢీకొట్టే ప్రమాదం కొద్దిలో తప్పింది.
 
ఈ ఘటన మంగళవారం ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్‌ 2 స్టాండ్‌ నంబరు 201 వద్ద జరిగింది. ఈ స్టాండ్‌ వద్ద ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లేందుకు ఇండిగో విమానం సిద్ధంగా ఉంది. మరికొద్ది నిమిషాల్లో టేకాఫ్‌ ఉండగా.. గో ఫస్ట్‌కు చెందిన ఓ మారుతి స్విఫ్ట్‌ డిజైర్‌ కారు విమానం ముందు భాగం కిందకు దూసుకొచ్చింది. 
 
దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్‌ వెంటనే ఆపడంతో విమానం చక్రాన్ని ఢీకొట్టే ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని కారు డ్రైవర్‌ మద్యం సేవించాడా లేదా అని తెలుసుకునేందుకు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో అతడిని నెగెటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది. కాగా.. ఈ ప్రమాదంపై అటు ఇండిగో గానీ, ఇటు గో ఫస్ట్‌ సంస్థ గానీ స్పందించలేదు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనా?