Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలి పెళ్లికి వచ్చిన లవర్.. స్వీట్ విసిరేసిన వధువు (వీడియో వైరల్)

Advertiesment
ప్రియురాలి పెళ్లికి వచ్చిన లవర్.. స్వీట్ విసిరేసిన వధువు (వీడియో వైరల్)
, శుక్రవారం, 18 జూన్ 2021 (18:22 IST)
కోవిడ్ వైరస్ విజృంభిస్తున్నాయి. ఇదే అదనుగా తీసుకుని ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. ఇలా కొన్ని పెళ్లిళ్లలో జరుగుతున్న ఫన్నీ సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నవ్వులు పూయిస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో జరిగిన అలాంటి సంఘటన వైరల్‌గా మారింది. తన ప్రేయసి పెళ్లికి వెళ్లిన ఓ యువకుడి ప్రవర్తన సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.
 
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ యువకుడు పెళ్లి వేదిక మీద ఉన్న వధువు దగ్గరికి ఏడుస్తూ వెళ్లి స్వీట్ నోట్లో పెడతాడు. ఆమె అది తినడానికి నిరాకరిస్తుంది. దీంతో దానిని ఆమె చేతిలో పెట్టి కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోతాడు. వీరిద్దరూ మాజీ ప్రేమికులని ప్రచారం జరుగుతోంది. అది ఎంత నిజమో తెలియదు కానీ.. వీడియో మాత్రం వైరల్‌గా మారింది. నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
 
మరోవైపు వేరొక వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. వివాహ వేదికపై ఓ జంట నిల్చుని వుండగా.. పెళ్లికొడుకు స్వీట్ ఇవ్వమని వధువు చేతికి అందించింది ఓ మహిళ. ఆ స్వీట్ తీసుకుని వరుడికి ఇచ్చింది వధువు. కానీ వరుడు ఆ స్వీట్ తీసుకునేందుకు ఆలోచిస్తూ వుండటంతో అంతే కోపంతో ఊగిపోయిన వధువు స్వీట్‌ను వేదిక బయటికి స్వీటును విసిరేసింది. ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tube indian


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్, వస్తానన్న ప్రియుడు ఫోన్ తీయకపోయేసరికి...