Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆప్ కీ సర్కార్.. మోడీ కుంభస్తలాన్ని కొట్టి కేజ్రీవాల్

Advertiesment
ఆప్ కీ సర్కార్.. మోడీ కుంభస్తలాన్ని కొట్టి కేజ్రీవాల్
, మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (09:42 IST)
ప్రధానమంత్రి నరేద్ర మోడీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుంభస్తలాని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కొట్టారు. ఢిల్లీమే ఆప్ కి సర్కార్ అంటూ ప్రకటించారు. మొత్తం 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో ఆప్ పార్టీ ఏకంగా 54 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 15, కాంగ్రెస్ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలోనే ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాల ట్రెండ్ చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల ప్రకారమే, మెజారిటీకి చేరువవుతోంది. 
 
ఇటీవల ఢిల్లీకి అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, మొత్తం 70 నియోజకవర్గాల ట్రెండ్స్ బయటకు వచ్చాయి. ఆప్ 84 చోట్ల ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 15 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది. 
 
మరోవైపు న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్, ప్రతాప్ గంజ్‌లో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, షాకుర్ బస్తీ నుంచి మంత్రి సత్యేంద్ర జైన్ ఆధిక్యంలో ఉండగా, రోహిణి నియోజకవర్గంలో బీజేపీ నేత విజయేంద్ర కుమార్ ముందంజలో ఉన్నారు. 
 
చాందినీ చౌక్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని అల్కా లాంబా వెనుకంజలో ఉన్నారు. సెంట్రల్ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకపక్ష విజయం దిశగా సాగుతుండగా, వాయవ్య ఢిల్లీలో మాత్రం బీజేపీ తన బలాన్ని ప్రదర్శిస్తోంది. కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఫలితాల సరళి తెలియజేస్తూ ఉండటంతో ఆప్ కార్యాలయాల వద్ద సంబరాలు మొదలయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధాని ఆందోళనకు రైతు సంఘాల సంఘీభావం