Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడు విద్యుత్ బోర్డుతో భారత్ బిల్‌పే కీలక ఒప్పందం

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ప్రారంభించిన ఆన్‌లైన్ పేమెంట్స్ సర్వీస్‌ సంస్థల్లో ఒకటైన భారత్ బిల్ తమిళనాడు మార్కెట్‌పై కన్నేసింది. ఇందులోభాగంగా, తమిళనాడు విద్యుత్ బోర్డు వినియోగదారుల్లో 2.79 కోట్ల మంది ఆన్‌లైన్ ఖాతాదారులకు తమ

తమిళనాడు విద్యుత్ బోర్డుతో భారత్ బిల్‌పే కీలక ఒప్పందం
, సోమవారం, 30 ఏప్రియల్ 2018 (17:06 IST)
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ప్రారంభించిన ఆన్‌లైన్ పేమెంట్స్ సర్వీస్‌ సంస్థల్లో ఒకటైన భారత్ బిల్ తమిళనాడు మార్కెట్‌పై కన్నేసింది. ఇందులోభాగంగా, తమిళనాడు విద్యుత్ బోర్డు వినియోగదారుల్లో 2.79 కోట్ల మంది ఆన్‌లైన్ ఖాతాదారులకు తమ సేవలు అందించేదిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం తమిళనాడు విద్యుత్ బోర్డు (టాన్‌జెడ్‌కో)తో ఒత ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
 
ఇదే అంశంపై భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఏ.ఆర్. రమేష్ మాట్లాడుతూ, ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా కొనసాగించేందుకు వీలుగా తమిళనాడు విద్యుత్ బోర్డుతో ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ తరహా ఒప్పందాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నారు. 
 
ఈ ఒప్పందం మేరకు వినియోగదారుడు ఎక్కడ నుంచైనా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చన్నారు. అలాగే, తాము 2.79 కోట్ల వినియోగదారులపై కన్నేసినట్టు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 77 బిల్లర్లు ఉండగా, 1.7 మిలియన్ ఏజెంట్ ఔట్‌లెట్స్ ఉన్నట్టు తెలిపారు. ఇందులో ఒక్క తమిళనాడులోనే తమిళనాడులోనే లక్ష మంది వరకు ఉన్నట్టు తెలిపారు.
webdunia
 
ఆ తర్వాత టాన్‌జెడ్‌కో ఫైనాన్స్ డైరెక్టర్ ఎం. మనోహరన్ స్పందిస్తూ, సురక్షితమైన బిల్లుల చెల్లింపుల కోసం భారత్ బిల్‌పేతో కుదుర్చుకున్న ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా, విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం దూర ప్రాంతాల నుంచే వచ్చే కష్టాలు తొలగిపోతాయన్నారు. ఇంట్లో నుంచే తమ విద్యుత్ బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించుకోవచ్చని తెలిపారు. 
 
అదేసమయంలో విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం తమపై ఒత్తిడి చేస్తోందన్నారు. అంతేకాకుండా, ఇందుకోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహించి నిర్దిష్ట లక్ష్యాలను నిర్ధేశిస్తోందని ఆయన తెలిపారు. అందువల్ల తాము కూడా విద్యుత్ బిల్లుల చెల్లింపులను ఆన్‌లైన్‌లో ప్రోత్సహించేలా ఈ తరహా ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కానిస్టేబుల్స్ డ్రైవ్ .. దళిత యువకుల ఛాతిపై ఎస్సీ, ఎస్టీ అంటూ రాతలు