Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భాజపాను ఏపీలో సమాధి చేస్తారు : బొండా ఉమామహేశ్వర రావు

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సమాధి చేసినట్టు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సమాధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు జోస్యం చెప్పారు.

భాజపాను ఏపీలో సమాధి చేస్తారు : బొండా ఉమామహేశ్వర రావు
, గురువారం, 22 మార్చి 2018 (14:01 IST)
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సమాధి చేసినట్టు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సమాధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు జోస్యం చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కుటిల రాజకీయాలను దేశం మొత్తం కూడా వ్యతిరేకించే పరిస్థితి వచ్చిందన్నారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన మోసం బయటపడుతుందనే అవిశ్వాసంపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. కేంద్రానికి రాష్ట్ర బీజేపీ కూడా వంత పాడుతోందని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీపైన లేదా? అని ప్రశ్నించారు. 
 
భాజాపా నేత విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే రీతిలో మాట్లాడుతున్నారని.. రాంమాధవ్‌, హరిబాబు రాష్ట్రంపై యుద్ధంచేస్తామంటున్నారని వీరందరినీ ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటామని చెప్పారు. జనసేన అధినేత పవన్‌కు నాలుగేళ్ల తరువాత ప్రభుత్వంలో అవినీతి కనపడుతోందా? అని ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోక్‌సభలో మళ్లీ అదే రభస... పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా