బీహార్‌లో ఇద్దరు మహిళలు తమ భర్తను పంచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న ఇద్దరు భార్యల వింత ఘటన బీహార్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పూర్ణియా జిల్లాలో రూపౌలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసి ఏడేళ్ల క్రితం మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు కూడా కన్నారు.
ఆ తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. తన భర్త రెండవ వివాహం చేసుకున్నాడని తెలియగానే, మొదటి భార్య పలు ఆరోపణలు చేసింది. కానీ తప్పును అంగీకరించిన భర్తను క్షమించమని రెండో భార్యను వేడుకున్నాడు.
పిల్లల వద్దకు వెళ్లాలని కోరాడు. అయితే ఇద్దరి భార్యలతో ఆ వ్యక్తి నానా తంటాలు పడ్డాడు. దీంతో పెద్దలు పంచాయతీ చేశారు. ఇద్దరు భార్యలతో ఇక్కట్లు పడుతున్న అతనికి చక్కని దారి చెప్పారు. పెద్ద భార్యతో మూడు రోజులు, చిన్న భార్యతో మూడు రోజులు వుండవచ్చునని చెప్పారు. అంతేగాకుండా ఇధ్దరు భార్యల గొడవలు చూసి భర్తకు ఒక రోజు సెలవు ఇచ్చారు.