బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ నేత, సినీ నటి కుష్బూ పాల్గొన్నారు. ఆమె ఈ సందర్భంగా బతుకమ్మను ఎత్తుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చార్మినార్ ప్రాంగణంలో పూలతో అలంకరించిన బతుకమ్మ ఆడిపాడారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలకు కుష్భూతో సహా మిగిలిన మహిళా నేతలందరూ నృత్యం చేసి పండగ చేసుకున్నారు.
ఈ సందర్భంగా కుష్భూ మాట్లాడుతూ.. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తాము సినిమాల్లో డ్యాన్స్ చేస్తాం.. అక్కడ కొరియోగ్రాఫర్ తమకు ఎలా డ్యాన్స్ చేయాలో చెప్తారు. కానీ ఇక్కడ మహిళలు సొంతంగా డ్యాన్స్ చేయడం చూస్తుంటే సంతోషంగా వుందన్నారు.