Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

Advertiesment
puppy-duckling happily enjoying

ఐవీఆర్

, సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (20:58 IST)
కర్టెసి-ట్విట్టర్
మనిషన్నాక కూసింత కళాపోషణ వుండాల అనేది సినిమా డైలాగ్. అంటే... ఎంత పెద్ద వ్యాపారాలు చేస్తున్నా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా... ఇంకా తీరక లేని పనులు చేస్తున్నా కూడా జీవితంలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులుతో కలిసి అప్పుడప్పుడు ప్రకృతి అందాల మధ్య సంతోషంగా కొంత సమయాన్ని గడపాలి. పాపం... ప్రస్తుతం చాలామంది మనుషులకు మాత్రం ఇది సాధ్యం కావడంలేదు. కానీ జంతువులు మాత్రం కాస్తో కూస్తో ఎంజాయ్ చేస్తున్నాయ్. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఓ కుక్కపిల్ల తనతో పాటు బాతుపిల్లను వెంటేసుకుని తెగ చక్కెర్లు కొట్టేస్తుంది. బాతుపిల్ల కిందపడిపోతుంటే పైకి లేపుతుంది. పరుగెత్తలేకపోతే నోటితో పట్టుకుని తనతో తీసుకెళ్తోంది. సాయంత్రం సూర్యాస్తమయాన్ని పక్కనే కూర్చోబెట్టుకుని అలా చూస్తోంది. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15వ ఏజిస్ గ్రాహం బెల్ అవార్డ్స్‌ ఫర్ సోషల్ గుడ్ ఇన్నోవేషన్ విత్ పాథోరోల్ ఫైనలిస్ట్‌గా కెమిన్ ఆక్వాసైన్స్ ఎంపిక