Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసిపి పనయిపోతుంది, 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు మరో పార్టీతో: నటుడు శివాజీ

Advertiesment
49 MLAs and 9 MPs
, శుక్రవారం, 4 మార్చి 2022 (18:54 IST)
రాజధాని అమరావతి విషయంలో వైసిపి ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు గోడ దూకేందుకు సిద్ధంగా వున్నారని సినీ నటుడు శివాజీ అన్నారు. తనకు తెలిసి 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు మరో పార్టీతో టచ్‌లో వున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

 
దేశంలోనే అమరావతి రాజధానిని ధీటుగా తీర్చిదిద్దాల్సిందిపోయి దాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తారా? రాజధానికి సామాజిక వర్గాన్ని అంటగడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ఇపుడా మాట ఎందుకు ఎత్తడం లేదో చెప్పాలన్నారు. విశాఖ ఉక్కు, అమరావతి అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ మాజీ నేతలను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డి : వీహెచ్ ఫైర్