Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్నీలియోన్ సన్నబడిందా...! ఏం.. ఎందుకు..? ఏమైంది..?

Advertiesment
bollywood news
, బుధవారం, 13 మే 2015 (14:41 IST)
బాలీవుడ్ హాట్ స్టార్ సన్నీలియోన్ సన్నబడిందట. వళ్ళు చేయకుండా ఉండేందుకు ఈ భామ నానా తంటాలు పడుతోందట. ఒళ్లు పెరిగితే ఒరిజినల్ వయసు బయటపడిపోతుందని తెగ ఫీలయిపోతోందట. నేటికి అంటే మే13,2015 నాటికి ఈ భామ 34 సంవత్సరంలోకి అడుగుపెట్టింది.  పైకి తన వయస్సు 34 ఏళ్ళేనని చెబుతున్నా మరింత ఎక్కువగానే ఉంటుందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
పోర్న్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన సన్నీలియోన్ ఫిల్మ్ ఇండస్ర్టీలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. ఈ భామ తనపై పడిన పోర్న్ ముద్రను క్రమంగా చెరిపేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. బుధవారంతో ఈ బ్యూటీ 34వ ఏట‌ అడుగుపెట్టినట్టు వికీపీడియా సమాచారం చెబుతున్నా ఆమె అసలు వయస్సులో తేడా ఉంటుందని ఇండస్ట్రీ లెక్కి. ‘జిస్మ్ 2’తో ఇండస్ర్టీలో అడుగుపెట్టిన ఈమె కుర్రాళ్ళ మతులు పోగొట్టేసింది. 
 
తర్వాత అవకాశాలు లేక కెనడా వెళ్లిపోవాలని భావించింది. అయితే షూటౌట్ ఎట్ వడాలా, జాక్‌పాట్ వంటి సినిమాలతో బిజీ అయ్యింది. కామెడీ, రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్, స్పెషల్ సాంగ్స్‌తో బాలీవుడ్‌నేకాదు, దక్షిణాది ప్రేక్షకులనూ తన వైపు తిప్పేసుకుంటోంది. అసలు వయస్సు కనిపించకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలే తీసుకుంటోందట. అలాగైతే మరికొంత కాలంలో ఫిలిం ఇండస్ట్రీ ఉండవచ్చునని ఆశ.. ఎనీ హౌ సన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

Share this Story:

Follow Webdunia telugu