Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచు మనోజ్ కు నేటి నుంచి కంచే.. ప్రణతీతో నిశ్చితార్థం

Advertiesment
Manchu Manoj
, బుధవారం, 4 మార్చి 2015 (08:21 IST)
మంచు మనోజ్ బ్రహ్మచార్య జీవితానికి నేటి నుంచి ముకుతాడు పడనున్నది. ఇన్నాళ్ళు ఎక్కడ తిరిగినా ఏమి చేసినా కొంత స్వేచ్ఛ ఉండేది. కానీ దానికి ఇకపై చెక్ పడనున్నది. ఆయన ఖచ్చితంగా ఆమె కోసం కొంత రోజులో కొంత సమయమైనా కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడబోతోంది. ఎవరా వ్యక్తి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రణతీ, మనోజ్ ల నిశ్చితార్థం బుధవారం హైదరాబాద్ లో జరుగనున్నది. వివరాలిలా ఉన్నాయి. 
 
హీరో మంచు మనోజ్, ప్రణతిరెడ్డిలు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. అయితే వీరికి ఒకటి చేసే తొలి కార్యక్రమం నిశ్చితార్థాన్ని వారి కుటుంబ పెద్దలు నిర్ణించారు. ఈ నిశ్చితార్థం బుధవారం ఉదయం 10.30లకు  బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్ హయత్ హోటల్‌లో జరుగనున్నది. ఇందుకోసం మోహన్‌బాబు కుటుంబం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడుతో పాటు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా హాజరు కానున్నట్టు సమాచారం. 
తమ కుటుంబంలోకి రాబోయే 'ప్రణతిరెడ్డి' తనకు మూడో కూతురు అని హీరో మోహన్ బాబు ఇప్పటికే ట్విట్ చేశారు. మంచు లక్ష్మి, విరానికాలాగా తనకు ఆమె మరో కుమార్తెగా ఆయన అన్నారు.
 
ఈ నిశ్చితార్థ వేడుకను తెలుగు సంప్రదాయ పద్ధతుల్లోనే చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదట మనోజ్ ఇంట్లో పూజ నిర్వహిస్తారు. తరువాత హోటల్లో ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రణతి రెడ్డి బిట్స్ పిలానిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అంతే కాకుండా మంచు విష్ణు భార్య విరానికాకు క్లాస్మేట్ అనే విషయం తెలిసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu