Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘మా’ పై రాజేంద్ర ప్రసాద్ కన్ను.. అధ్యక్ష పదవిపై పోటీకి రెడీ

Advertiesment
Tollywood
, మంగళవారం, 3 మార్చి 2015 (07:04 IST)
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. మా అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి పలువురు నటులు, హీరోలు సై అంటున్నారు. దీంతో తెలుగు చిత్ర సీమలో వేడి పుడుతోంది. తాజాగా సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ తాను మా ఎన్నికలలో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. 
 
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి కోసం నెలాఖరులో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు డా. రాజేంద్రప్రసాద్‌ వెల్లడించారు. ఇప్పటివరకు నవ్వులతో ప్రజల్ని మెప్పించాననీ, ప్రస్తుతం కుటుంబపరంగా అన్ని బాధ్యతలు తీరిపోయాయనీ, ఏదో ఒకటి సేవారంగంలో వుండాలనే అనుకుంటుండగా 'మా' ఎన్నికలు వచ్చాయనీ, స్నేహితులంతా కలిసి సపోర్ట్‌ చేయడంతో నిలబడుతున్నానని చెప్పారు.
 
రాజేంద్రప్రసాద్‌ గతంలో మురళీమోహన్‌పై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత నటుడిగా తన కెరీర్‌పై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం రాష్ట్రం రెండుగా విడిపోయినా నటీనటులు విడిపోయినా అందరి సహకారంతో ముందుకు సాగుతానని చెబుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu