సినీ హీరో వెంకటేష్ తనకు సోదరుడితో సమానమని ఆ సంబంధంతోనే తాము గోపాల గోపాల సినిమాలో కలసి నటించామని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. ఆధ్యాత్మిక చింతన ఆయనలో అధికంగా ఉంటుందని చెప్పారు. ఆదివారం శిల్పాకళావేదికలో జరిగిన గోపాల గోపాల ఆడియో విడుదల కార్యక్రమానికి ఈ ఇద్దరు హీరో హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తకపహ వెంకటేష్ తో వ్యక్తిగతమైన సంబంధం ఉందన్నారు. తాను కలుసుకునే తక్కువ వ్యక్తులలో ఆయన ఒకరని వివరించారు. తాము కలసినప్పుడు సినిమాల గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటామని చెప్పారు.
ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయన్నారు. ఈ సినిమా చేయడానికి అదే కారణమని చెప్పారు. చాలా భయంతో భగవంతుడి పాత్ర చేశానని అన్నారు. ఏమైనా పొరపాట్లు చేసివుంటే క్షమించాలని పవన్ కళ్యాణ్ కోరడం కొసమెరుపు.