వారి కోసం ఆమె పరితపిస్తోంది. తన అందాలతో ప్రేక్షకుల మతిపోగొడుతోంది. ఓర చూపుతో కైపెక్కిస్తోంది. చూడాల్సిన వారు తనవైపు చూసేంత వరకూ రకరకాల భంగిమలతో, విన్యాసాలతో అదరగొడుతోందట ఆ భామ. ఎవరా భామ అని చూస్తే. మల్లిక.. మల్లికా షరావత్. ఇంతకీ ఏంటి సంగతి?
కాన్స్ ఫిలింఫెస్టివల్‌కి హాజరైన బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ వేస్తున్న వేషాలు అన్ని ఇన్నీ కావు. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలో కంట్లో పడటంతోపాటు వరల్డ్ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కత్రినా కన్నా తనకే ఎక్కువ ఇమేజ్ రావాలన్నట్లు తాను వెళ్లినచోటల్లా తన ప్రత్యేకతని చాటుకునేందుకు ప్రయత్నిస్తోందట.
చర్చావేదికలు, ప్రీమియర్ షోలో పాల్గొన్న మల్లిక ఆ ఫోటోల్ని ట్విటర్‌లో పోస్ట్ చేసి ఆ హంగామాని ఇక్కడున్న ఇండియన్స్‌కి చూపిస్తోంది. అందులో భాగంగానే ఓ డిజైనర్ రూపొందించిన ఈ నెక్లెస్‌ని ధరించిన ఆమె.. తన సున్నితమైన మెడపై నెక్లెస్ రూపంలో 2 మిలియన్ డాలర్లబాధ్యత వుందంటూ... ఆ నెక్లెస్ డిజైనర్‌కి థాంక్స్ చెప్పుకుంటూ ఇంకొన్ని ట్వీట్స్ చేసింది. ఇండియన్ కరెన్సీలో దాని విలువ రూ.12 కోట్ల 66 లక్షల 80వేలు.