కామెడీ షోలో కులాన్ని కించపరచాడన్న ఆరోపణలున్నా కేసులో టీవీ ఆర్టిస్టు జబర్దస్త్ వేణును పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఆయనపై కొన్ని కుల సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. వివరాలిలా ఉన్నాయి.
గతంలో ప్రసారమైన 'జబర్దస్త్' కార్యక్రమంలో తమ వృత్తిని అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఫిల్మ్ నగర్లో కొందరు వ్యక్తులు వేణుపై దాడి చేశారు. ఈ దాడితో పరస్పర కేసులు నమోదయ్యాయి. ఈ పరంపరలో పోలీసులు వేణును అరెస్టు చేశారు.