Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటి ఆసిన్ ప్లాటు వేలానికి కోర్టు అనుమతి... ఎందుకు? ఎక్కడ?

Advertiesment
Actress Asin
, శనివారం, 3 జనవరి 2015 (08:45 IST)
ఇవ్వాల్సిన సొమ్ము చెల్లించకపోవడంతో నటి అసిన్ ప్లాట్ వేలానికి కోర్టు అనుతించింది. ఆధునీకరణకు అయిన ఖర్చును ఈ నెల 14 తేదీ లోపు చెల్లించకపోతే నేరుగా వేలం వేసుకోవచ్చునని తద్వారా వచ్చిన సొమ్మును ఆధునీకరణ అయిన ఖర్చులో జమ చేసుకోవచ్చునని ఆదేశాలలో తెలిపింది. వివరాలిలా ఉన్నాయి. 
 
సినీ నటి, కేరళ కుట్టీ ఆసిన్ కు కొచ్చి సమీపంలోని రవిపురంలో అసిన్‌కు డబుల్‌బెడ్ రూం ఫ్లాట్ ఉంది. ఇంటీరియర్ డెకరేషన్ కొచ్చికి చెందిన ఓ ప్రైవేటు సంస్థకు ఇచ్చింది. దీనికిగాను, రూ.పది లక్షలు బిల్లు అయింది. ఎంతకీ ఆసిన్ బిల్లు చెల్లించకపోవడంతో ఆ సంస్థ నిర్వాహకురాలు జయలక్ష్మి ఎర్నాకులం న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. 
 
ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయ స్థానం ఈ నెల 14వ తేదీలోపు రూ. 10 లక్షలు కోర్టులో చెల్లించాలని ఆదేశించింది. చెల్లించని పరిస్థితులలో ఆమె ఇంటిని వేలం వేయాలని తీర్పు చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu