Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు!
FILE
జాతీయ ఉత్తమనటుడిగా పేరుగాంచిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోన్న ప్రకాష్‌ రాజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా చెప్పనక్కరలేదు.

కన్నడం, తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ప్రకాష్ రాజ్, 2009 సంవత్సరానికిగాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును (కాంచీవరం చిత్రానికి) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

"హాయ్" చిత్రం ద్వారా తెలుగులో ఆరంగేట్రం చేసిన ప్రకాష్ రాజ్, ప్రస్తుతం అతను నటించని సినిమానే లేదనే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో చిరంజీవి వంటి అగ్రహీరోలు నటించే పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఇలా ప్రకాష్ రాజ్ నటించిన ఇడియట్, నువ్వే నువ్వే, ఖడ్గం, ఒక్కడు, గంగోత్రి, దిల్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నువ్వు నాకు నచ్చావ్, మురారి, చూడాలనివుంది, సుస్వాగతం, నిజం, సింహాచలం, శివమణి, లక్ష్మీనరసింహ, వర్షం, సాంబ, యజ్ఞం, శ్రీ ఆంజనేయం, సంక్రాంతి, బన్నీ, పోకిరి, విక్రమార్కుడు, బొమ్మరిల్లు, స్టాలిన్, జల్సా, ఆకాశమంత వంటి పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.

తాజాగా వరుడు, కొత్తబంధం, బృందావనం వంటి చిత్రాల్లో నటిస్తోన్న ప్రకాష్ రాజ్, దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో మాత్రం 50 చిత్రాలపైగా నటించిన ప్రకాష్ రాజ్, దక్షిణాది భాషల్లో మొత్తం 100 చిత్రాలకు పైగా నటించారు. నటుడిగా మాత్రమే గాకుండా ఓ నిర్మాతగానూ అవతారమెత్తిన ప్రకాష్ రాజ్ కర్ణాటకలోని పుట్టూరులో పుట్టాడు.

బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఇండియన్ హైస్కూలులో చదివాడు. ఇంకా బి.కామ్ డిగ్రీ పూర్తి చేశాడు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమైన ప్రకాష్ రాజ్‌కు నేడు (26-03-2010) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రకాష్ పర్సనల్ టచ్ మీ కోసం..

అసలు పేరు: ప్రకాష్ రాజ్
జన్మస్థలం: కర్ణాటక.
పుట్టినతేదీ: 26-03-1965.
జాతీయ అవార్డులు: మూడు
తెలిసిన భాషలు: కన్నడం, తుళు, ఆంగ్లం, తమిళం, మలయాళం, తెలుగు.
నటించిన సినిమాలు: వందకుపైగా.

Share this Story:

Follow Webdunia telugu