Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"వరుడు"కి పుట్టినరోజు శుభాకాంక్షలు!

WD
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, మెగాస్టార్, పీఆర్పీ అధినేత చిరంజీవి మేనల్లుడు "వరుడు" (అల్లు అర్జున్)‌కి నేడు (ఏప్రిల్ 8) పుట్టినరోజు. తెలుగు సినీరంగంలో యూత్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో కట్టిపడేసే అల్లు అర్జున్..‌ "గంగోత్రి" చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.

తొలి చిత్రంలోనే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న బన్ని, మెగాస్టార్ చిరంజీవి నటించిన "డాడీ" చిత్రంలో గోపీగా పరిచయమయ్యాడు. రెండో సినిమా "ఆర్య" ద్వారా మాస్ ప్రేక్షకులకు దగ్గరమైన అల్లు అర్జున్.. ఈ చిత్రానికి గానూ "సంతోషం బెస్ట్ యంగ్ ఫెర్‌ఫార్మర్స్ అవార్డు"ను సాధించాడు. ఇంకా ఇదే చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా గెల్చుకున్నాడు.

ఈ క్రమంలో "వరుడు" హీరోగా నటించిన బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు వంటి చిత్రాలు అల్లు అర్జున్‌కు మంచి గుర్తింపును సంపాదించిపెట్టాయి. అలాగే తాజాగా విడుదలైన ఆర్య-2, వరుడు చిత్రాలు కూడా మాస్‌ ప్రేక్షకుల్లో క్రేజ్‌ను క్రియేట్ చేశాయి.

ప్రస్తుతం అల్లుఅర్జున్ వేదం, బద్రీనాథ్ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి. బన్ని పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ పర్సనల్ టచ్ మీకోసం..

అసలు పేరు: అల్లు అర్జున్
పుట్టిన తేదీ: ఏప్రిల్ 8, 1983,
జన్మస్థలం: చెన్నై,
తొలి సినిమా: ఆర్య,
అవార్డులు: సంతోషం రెండు, నంది ఒకటి.

Share this Story:

Follow Webdunia telugu