Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొద్దందాల ముద్దుగుమ్మ 'నమిత' పర్సనల్ టచ్

Advertiesment
నమిత
WD
దక్షిణాది సినీ పరిశ్రమను తన అందచందాలతో ఓ ఊపు ఊపుతున్న అందాల బొద్దుగుమ్మ "నమిత". తాజాగా "జగన్మోహిని" చిత్రం కోలీవుడ్‌లో రిలీజ్ అయి ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. ఆమెకు ఇదే తరహా పాత్రలు వెల్లువల్లా వచ్చి పడుతున్నాయట. తెలుగులోనూ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 'సింహా' చిత్రంలో నమిత గ్లామర్ రోల్‌ను పోషిస్తోంది.

తెలుగు, తమిళ చిత్రాల్లో భారీగా అందాలను ఆరబోసే ఈ ముద్దుగుమ్మ తాజాగా మలయాళంలో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రంలో బార్ డ్యాన్సర్‌గా కనిపించబోతుందట. ఇందులో కొన్ని షాట్ సీన్లుకూడా ఉన్నాయని తెలిసింది. ఈ చిత్రాన్ని మలయాళ దర్శకుడు పాప్పన్ రూపొందిస్తున్నాడు.

ఇకపోతే... సూరత్‌లో జన్మించిన నమిత.. 1998లో మిస్ సూరత్‌గా, 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించింది. "జెమిని" చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి.. దక్షిణాది సినీ పరిశ్రమలో గ్లామర్ క్వీన్‌గా ఓ ముద్ర వేసుకున్న నమిత దాదాపు 30 సినిమాలకు పైగా నటించింది. మాయ అనే ఇంగ్లీష్, మరో హిందీ చిత్రంలో నటించిన నమిత తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవ చేస్తోంది. ఇకపోతే.. తెలుగులో ఇద్దరు మొనగాళ్లు, ప్రేమోత్సవం, దేశద్రోహి వంటి చిత్రాల్లో నటిస్తోన్న నమిత గురించి కొంచెం తెలుసుకుందామా..?

అసలు పేరు: నమిత ముకేష్ వాంక్వాలా.
పుట్టిన తేదీ: జనవరి 27, 1977.
నటించిన చిత్రాలు: 30కిపైగా.
అభిమాన సంఘాలు: 2500కి పైగా,
జన్మస్థలం: సూరత్,
చదువు: బి.ఎ.

Share this Story:

Follow Webdunia telugu