Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు అమృతవర్షిణి ఎస్. జానకి పుట్టిన రోజు

నేడు అమృతవర్షిణి ఎస్. జానకి పుట్టిన రోజు
కోకిల స్వరంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజండ్రీ నేపథ్య గాయని ఎస్.జానకి. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో గేయాలను ఆలపించిన ఎస్. జానకికి నేడే పుట్టిన రోజు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా 30వేల పాటలకు పైగా ఆలపించి సరికొత్త రికార్డు సృష్టించారు.

శ్రీకృష్ణుడు, సాయిబాబా భక్తులారైన జానకి.. మీరాపై అనేక భక్తిగీతాల క్యాసెట్లను విడుదల చేసింది. అలనాటి గాయకుడు ఘంటసాల పాటలకు గాయనిగా స్వరాన్నిచ్చి.. నేటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వరకు మధురమైన స్వరంతో సంగీత సముద్రంలో కడిగిన ముత్యంలా మెరుస్తున్న జానకి.. గుంటూరు జిల్లాల్లో పుట్టారు.

నాదస్వరం విద్వాన్ శ్రీ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏటనే గాయనిగా అవతారమెత్తారు. మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి.. తెలుగులో హిట్ అయిన ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు. 1957వ సంవత్సరంలో తన కెరీర్‌ను ప్రారంభించిన జానకి.. తమిళం, తెలుగు సినిమాల కోసం తానే స్వయంగా పాటలు రాశారు.

హిందీ, సిన్హాలే, బెంగాలి, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేశారు.

ఇలా గాయనిగా పేరుగాంచిన జానకి వి. రామ్‌ప్రసాద్‌ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. ఆరు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 25కి మించిన అవార్డులను జానకి సొంతం చేసుకున్నారు. అరుదైన స్వరంతో సంగీత అభిమానుల మదిలో నాటుకుపోయిన ఎస్. జానకి జన్మదినం సందర్భంగా ఆమె పర్సనల్ టచ్ మీ కోసం..

పూర్తి పేరు.. ఎస్. జానకి,
జన్మస్థలం: గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
పుట్టిన తేదీ : ఏప్రిల్ 23, 1938 (1938-04-23)
పాడిన పాటలు: 30వేలకు పైగా.

Share this Story:

Follow Webdunia telugu