Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి ఆనంద నిలయం... అనంత చరిత్ర..!!

-పుత్తా యర్రం రెడ్డి, ఎమ్ఎస్, పీఆర్, సీనియర్ పాత్రికేయులు

Advertiesment
శ్రీవారి ఆనంద నిలయం... అనంత చరిత్ర..!!
, శనివారం, 1 అక్టోబరు 2011 (11:47 IST)
WD
ఆనంద నిలయం అనే మాట వినగానే టపీమని కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఆ ఆనంద నిలయాన్ని అదే పనిగా గంటల తరబడి చూసినా తనివి తీరదు. అంతటి అందం ఆనంద నిలయంలో కనిపిస్తుంది. సాక్షాత్తు వేంకటేశ్వర స్వామిని చూసినంత తృప్తి కలుగుతుంది. ఇంతటి గుర్తింపు కలిగిన ఆనంద నిలయం అంటే ఏమిటి..? దానికి అంతటి ప్రాముఖ్యత ఎందుకు? దానిని ఎప్పుడు నిర్మించారు? ఎత్తెంత? అందులో ఎన్ని అంతస్తులున్నాయి? ఇలాంటి ప్రశ్నలు వెంటనే మస్తిష్కాన్ని తొలిచేస్తాయి. మీ సందేహాలన్నింటిని తీర్చడానికే ఈ కథనం. రండీ ఆనంద నిలయం విశేషాలేంటో తెలుసుకుందాం.

శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంతోషానికి గుర్తుగా గర్భగుడికి ఆనంద నిలయం అని నామకరణం చేశారు. ఆనంద నిలయ నిర్మాణం ఇందుకు తగ్గట్టుగానే ఉంటుంది. 12 వందల ఏళ్ళకుపైగా చరిత్ర కలిగిన ఆనంద నిలయం అణువణువు అబ్బురపరిచే నిర్మాణమే. నాటి కట్టడాల శిల్పసౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. మూడు అంతస్తులు కలిగిన ఈ కట్టడంలో ఎన్నో శిల్పాలు కొలువుదీరాయి.

బంగారు పూత పూసిన లోహపు రేకులతో తళతళలాడే గోపుర సౌందర్యం వర్ణనాతీతం. శ్రీవారికి గొడుగులాంటి ఈ కట్టడం దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారికి నాభిలాంటి ఈ గోపురం 65.2 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని పునాదే 15 నుంచి 20 అడుగులు ఉంటుంది. 27.4 అడుగుల వరకూ దీర్ఘచతురుస్రాకారంగా ఉండే నిర్మాణం ఆ తరువాత గుండ్రంగా సుందరంగా మారుతుంది.

మూడంతస్తుల నిర్మాణంలో మొదటి అంతస్తులో 10.9 అడుగుల ఎత్తు వరకూ ఎటువంటి విగ్రహాలూ ఉండవు. కానీ నిర్మాణంపై ద్రాక్ష ఆకుల ఆకారం చెక్కి ఉంటుంది. ఇది చూడడానికి చాలా సుందరంగా కనిపిస్తుంది. రెండో అంతస్తు విగ్రహ శోభతో వెలిగిపోతుంది. 10.9 అడుగుల ఎత్తుగల ఈ అంతస్తులో నాలుగు వైపులా 40 విగ్రహాలు కొలువుదీరి ఉంటాయి. ఇవన్నీ బంగారు కాంతులు వెదజల్లుతుంటాయి. ఇది భక్తిని, ఆధ్యాత్మికతను చాటి చెపుతుంది. ఇదే అంతస్తులోని ఈశాన్య భాగాన ఓ ప్రత్యేకత ఉంది. స్వామి వారిని దర్శించుకున్న ప్రతీ ఒక్కరు తలెత్తి ఆ ప్రాంతాన్ని చూసి తీరాల్సిందే.

దగదగలాడుతున్న వెండి తోరణం కింద స్వామి వారి విగ్రహం ఒక్కటి దర్శనమిస్తుంది. దీనినే విమాన వెంకటేశ్వరుడు అంటారు. విమాన వెంకటేశ్వరుని దర్శించుకుంటే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుని దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని పురణాలు చెపుతున్నాయి. మూడో అంతస్తు 16.3 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో దాదాపుగా 20 విగ్రహాలు ఉంటాయి. దాదాపుగా అన్ని విగ్రహాలు కూడా విష్ణు అవతారలే కావడం విశేషం. ఇవన్నీ కూడా బంగారు తొడుగులతో కాంతుల విరజిమ్ముతుంటాయి.

గోపురంలోని మూడో అంతస్తులో అన్ని దిశలలో స్వామివారికి కాపలా కాస్తున్నట్లుగా 8 సింహాల విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాల శిల్ప సౌందర్యం చూడముచ్చటేస్తుంది. చివరగా 5 అడుగుల ఎత్తులో గోపురంపై కలశం కొలువుదీరి ఉంటుంది. దీని కిందిభాగం అంతా బంగారు ఆకులు ద్రాక్షగుత్తులు, హంసలతోపాటు వివిధ రకాల పక్షుల ఆకారాలు చెక్కబడి ఉంటాయి.

ఇందులోని పొడవు వెడల్పులు తెలియకపోయినా ఇవన్నీ మన కంటి కనిపించేవే. మరి ఇంతటి మహత్తరమైన నిర్మాణం ఎవరు మొదలు పెట్టారు? ఎప్పుడు పూర్తి చేశారు? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే కలుగుతాయి. కలియుగ దైవానికి కాస్తంత గూడు కట్టించాలనే ఆలోచన క్రీ.శ 839లోనే కలిగింది. పల్లవ రాజు విజయదంతి విక్రమ వర్మకు ఆ అవకాశం దక్కింది. గోపురానికి బంగారు పూత ఆయనే మొదలు పెట్టారు. బంగారు పూత వేసే ప్రక్రియ దాదాపు 430 ఏళ్ళు పట్టిందంటే ఆశ్చర్యం కలుగుతుంది.

రాజులు పోయినా తరువాత వచ్చే పాలకులు ఆ బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు. గోపురానికి బంగారు పూత వేసే కార్యక్రమాన్ని క్రీ.శ 1262లో పాండ్య రాజు సుందర పాండ్య జతవర్మ పూర్తి చేశారు. తరువాత కాలంలోని పాలకులు అందరు శ్రీవారిపై అపారమైన భక్తితో ఎన్నో మార్పుల చేశారు. 1359లో అప్ప సాలవరాజు మంగిదేవ మహరాజు గోపురంపై కొత్త కలశాన్ని ప్రతిష్టించారు. విజయ నగర సామ్రాజ్య మంత్రి చంద్రగిరి మల్ల క్రీ.శ 1417 ఈ గోపురానికి కొత్త హంగులు తీసుక్చొచారు. ఆలంయలోనే కొన్ని మండపాలను నిర్మించారు. అప్పటికే తిరుమలలోని వేంకటేశ్వరునిపై విజయనగర ప్రభువులు అపారమైన భక్తిని ప్రదర్శిస్తున్నారు.

ఇక కృష్ణదేవరాయలు హయాంలో అయితే తిరుమలలో అనూహ్యమైన మార్పలు వచ్చాయి. క్రీ.శ 1513 నుంచి 1521 వరకూ కృష్ణదేవరాయలు ఏడుమార్లు కాలిబాటన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నాయి. ఆయన అందజేసి విలువైన కానుకలు నేటికీ తిరుమల శ్రీవారిని అలంకరిస్తున్నాయి. శ్రీవారికి పెద్ద కిరీటాన్ని బహూహకరించారు.

ఆనంద నిలయాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి కృష్ణదేవరాయలు 30వేల బంగారు నాణేలు ఆలయానికి కానుకగా ఇచ్చారు. వీటిని వినియోగించి ఆనంద నిలయానికి బంగారుపూత పూశారు. తరువాత క్రీ.శ 1908 రామలక్ష్మణ్‌ మహంతీ బంగారు కలశాన్ని పునఃప్రతిష్టించారు. క్రీ.శ 1918 ఆగష్టు 18 నుంచి 27 వరకూ ఆనంద నిలయంలోని విమాన వెంకటేశ్వరుడితోపాట కొన్ని విగ్రహాలను శుభ్రపరచి వాటికి మరమ్మత్తులు చేశారు. ఇలా ఎన్నోమార్పులు జరిగినా, వాతావరణంలో ఎంత మార్పు వచ్చినా ఆనంద నిలయం ఇప్పటికే భక్తజనంలో ఆనందాన్ని నింపుతూనే ఉంది.

Share this Story:

Follow Webdunia telugu