Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలయప్ప అలంకరణకు 11 టన్నుల ఆభరణాలు!!

Advertiesment
మలయప్ప అలంకరణకు 11 టన్నుల ఆభరణాలు!!
, బుధవారం, 28 సెప్టెంబరు 2011 (13:25 IST)
భక్తజనకోటికి ఇలవేల్పుగా ఉన్న తిరుమల వెంకన్నకు అక్షరాలా 11 టన్నుల బంగారం ఆభరణాలతో అలంకరిస్తారంటే అతిశయోక్తి కాదు. శ్రీవారి నిత్య అలంకరణలో 120 రకాల ఆభరణాలను వినియోగిస్తారు. ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వీటిని వినియోగిస్తారు.

శ్రీవారికి ప్రతి రోజూ చేసే అలంకారాన్ని నిత్యకట్ల అలంకారమనీ, పండుగలు, ఉత్సవాల్లో చేసే అలంకారాన్ని విశేషాలంకారమనీ పిలుస్తారు. మూలమూర్తి, ఉత్సవమూర్తి అలంకరణలకు వినియోగించే కిరీటాలు, ఆభరణాలు, ఇతర బంగారు వస్తు సామాగ్రిని కలుపుకుంటే సుమారు 11 టన్నులు బరువు కలిగివున్నట్టు సమాచారం.

స్వామివారి నిత్యం ధరించే ఆభరణాల్లో కొన్ని...
వజ్రకిరీటం, రత్నకిరీటం, వజ్రాల శంఖు చక్రాలు, రత్నాల శంఖు చక్రాలు, రత్నాల కర్ణ పత్రాలు, రత్నాల వైకుంఠ హస్తం, రత్నాల కటిహస్తం, రత్నాల మకరకంఠి, సువర్ణ పద్మపీఠం, సువర్ణ పాదాలు, నూపురములు, పాగడాలు, కాంచీగునము, అంకెలు, వడ్డాణాలు, ఉదర బంధం, దశావతార హారం, చిన్న కంఠాభరణం, బంగారు పులిగోరు హారం, గోపు హారం, సువర్ణ యజ్ఞోపవీతం, తులసి పత్రహారం, చతుర్భుజ లక్ష్మీహారం, అష్టోత్తర శతనామ హారం, సహస్ర నామహారం, సూర్య కఠారి, కడియాలు, కర భాషణములు, భుజదండ భూషణములు, నాగాభరణములు, భుజకీర్తులు, ఆకాశరాజు కరీటం, సాలిగ్రామ హారం, తిరుక్కాళం, వజ్ర అశ్వత్థపత్ర హారం, ముఖపట్టీ, ఐదు పేటల కంఠి, చంద్రవంక కంఠి తదితర ఆభరణాలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu