బ్రహ్మోత్సవాలు: చంద్రప్రభ వాహనంపై ఊరేగనున్న శ్రీనివాసుడు
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశాలేనని చాటిచెప్పేందుకే ఈ వాహన సేవలు జరుగుతాయని టీటీడీ అర్చకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి వున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. ఇకపోతే.. తిరుమలలోని తితిదే కల్యాణోత్సవం కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. కల్యాణోత్సవం కార్యక్రమాలలో జరిగిన అవినీతిపై అధికారులు ఆరా తీస్తున్నారు.